6 నెలల క్రితం పెళ్లి.. అంతలోనే భార్యను తూట్లుగా కాల్చి..

ఎన్నో కలలు.. కొత్త జీవితంపై మరెన్నో ఆశలతో ఒక్కటైన జంట.. పెళ్లి చేసుకుని గట్టిగా 6 నెలలు గడిచే లోపే ఏం జరిగిందో ఏమో వారిద్దరి జీవితాలూ విషాదాంతమయ్యాయి. కట్టుకున్న వాడే తుపాకీతో తూట్లుగా కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్‌లోని సీతామాఢీ సిటీలో ఈ దారుణం జరిగింది.

See Also

రైల్లో పరిచయం.. లాడ్జిలో అత్యాచారం

సైనికులు ప్రార్థనలో ఉండగా మిలటరీ క్యాంప్ పై ఎటాక్..

షాద్ నగర్‌లో ఓ ఇంటి దాబాపై చిరుత హల్‌చల్

చంద్ర భూషన్ క్విక్ రెస్పాన్స్ టీమ్ జవాన్. అతడు సీతామాఢీ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే మధు అనే యువతితో పెళ్లయింది. ఆదివారం ఉదయం వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని ఎంతసేపు తలుపు తట్టినా తీయలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. దంపతులిద్దరి మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. వారి శవాలను పోలీసులు పోస్టుమార్టానికి పంపారు. మధు బాడీలో భూషన్ ఏడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు వాళ్లు తెలిపారు. ఆ తర్వాత అతడు తలలో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. అయితే ఈ దారుణానికి పాల్పడడానికి కారణమేంటన్నది తెలియాల్సి ఉంది.

Latest Updates