కరోనా పాజిటివ్‌ జవాన్‌ ఆత్మహత్య

  • హాస్పిటల్‌ ఆవరణలోని ఉరివేసుకున్న జవాన్‌

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్‌ అని తేలిన ఆర్మీ జవాన్‌ ఒకరు వేస్ట్‌ ఢిల్లీ నరాయినా హాస్పిటల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రకు చెందిన ఆర్మీ జవాన్‌ సిగ్నాలమన్‌లో డ్యూటీ చేస్తున్నారు. ఆయనకు లంగ్‌ క్యాన్సర్‌‌ ఉండటంతో ఆర్‌‌ ఆర్‌‌ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆ తర్వాత ఆ జవాన్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఈ మధ్యే నరాయినా హాస్పిటల్‌కు షిఫ్ట్‌ చేశారు. కాగా.. మంగళవారం రాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన అతను హాస్పిటల్‌ ఆవరణలోని చెట్టకు ఉరి వేసుకున్నాడు. జవాన్‌కు లంగ్‌ క్యాన్సర్‌‌ ఉందని, కరోనా అని తేలడంతో ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని వెస్ట్‌ ఢిల్లీ పోలీస్‌ ఆఫీసర్‌‌ దీపక్‌ పురోహిత్‌ అన్నారు. అతని దగ్గర ఎలాంటి సూసైడ్‌ నోట్‌ కూడా దొరకలేదన్నారు.

Latest Updates