దేశభక్తిని ఇలా చాటుకున్నాడు: పచ్చబొట్టుతో అమరులకు నివాళి

బికనూర్ : పుల్వామా ఘటనలో మరణించిన జవాన్లకు దేశం మొత్తం సంతాపం తెలిపింది. క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించింది. జెండాలు పట్టుకుని అమర్ రహే హై అని దేశ భక్తిని చాటుకున్నారు. ఓ యువకుడు మాత్రం ఎవ్వరూ చేయలేని సాహసం చేసి దేశభక్తిని చాటాడు. రాజస్థా న్‌ లోని బికనీర్‌ జిల్లా యువకుడు గోపాల్‌ సహరన్‌ తన ఒంటిపై పచ్చబొట్లతో అమర జవాన్లకు నివాళులర్పించాడు. పుల్వామా టెర్రర్‌ అటాక్‌ లో చనిపోయిన వారితోపాటు ఈ మధ్య మరణించిన జవాన్లతో కలిపి 71 మంది పేర్లను ఒంటిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. దేశ రక్షణకు తమ జీవితాలను పణంగా పెట్టి, ఇతరులకు స్ఫూర్తినిచ్చే సైనికులకు నివాళులర్పించడానికే ఈ ప్రత్యేకమైన మార్గా న్ని ఎంచుకున్నానని భగత్‌ సింగ్‌ యూత్‌ బ్రిగేడ్‌ మెంబరైన సహరన్‌ చెప్పాడు.

Latest Updates