జయరామ్ హత్య కేసు: పోలీసు కస్టడీలో నిందితులు

జయరామ్ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. పీటీ వారెంట్ పై తెలంగాణకు తరలించిన నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు పర్మిషన్ ఇచ్చింది. రెండు వారాల పాటూ కస్టడీకి ఇవ్వాలని జుబ్లిహిల్స్ పోలీసులు  పిటీషన్ దాఖలు చేయగా.. మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలిచ్చింది కోర్టు. దీంతో.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు.

జయరామ్ హత్యకేసును వివిధ కోణాల్లో విచారణ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు పోలీసులు. ఇందుకోసం నిందితులను 2 వారాల కస్టడీకి ఇవ్వాలని నాపంల్లి కోర్టులో పిటిషన్ వేశారు జుబ్లీహిల్స్ పోలీసులు. కోర్టు మూడు రోజుల కస్టడీకి ఓకే చెప్పింది. చంచల్ గూడ జైల్లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకుని ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విచారణ చేయనున్నారు.

ఇప్పటికే కేసులో కొందరిని విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేశామన్నారు ఏసీపీ శ్రీనివాసరావు. నిందితులను కస్టడీలోకి తీసుకుని జయరాం,రాకేశ్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలపై  ఆరా తీస్తామన్నారు. నిందితులతో పాటు శిఖా చౌదరిని కూడా పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పిటకే శిఖా ఇంటికి వెళ్లిన పోలీసుల ఆమె పనిమనిషిని ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో జయరాం హత్యకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Latest Updates