జయరాం హత్య కేసు: నాంపల్లి కోర్టుకు ప్రధాన నిందితులు

హైదరాబాద్ : జయరాం హత్య కేసులో ప్రధాన నిందితులు… రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ లను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. 3 రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టారు. నిందితుల కస్టడీని పొడిగించాలని పోలీసులు కోరే అవకాశం ఉంది. ముందుగా నిందితులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షల పూర్తయ్యాక కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు పోలీస్ అధికారులను ఇప్పటికీ విచారించలేదు.

Latest Updates