జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ షాక్

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. దివాకర్ రెడ్డికి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీ లీజును క్యాన్సిల్ చేసింది. సిమెంట్ తయారీ ప్లాంట్ కు గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల్ని శుక్రవారం రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. దివాకర్ రెడ్డికి చెందిన త్రిషూల్ కంపెనీకి 650 హెక్టార్లలోని సున్నపురాతి గనులను సిమెంట్ తయారీ కొరకు గత ప్రభుత్వం ఐదేళ్లకు లీజుకిచ్చింది.

ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగూ పడనందునే ఈ రద్దు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆదేశాల్లో తెలిపింది ప్రభుత్వం. లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని తెలిపింది జగన్ ప్రభుత్వం.

లీజు రద్దు వ్యవహారంపై మాట్లాడారు జేసీ. ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకుంటానని చెప్పిన జేసీ..ప్రభుత్వం పగ పగ పగ అంటూ రగిలిపోతుందని దీన్నే ఫ్యాక్షనిజం అంటారని తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే తనకు జరిగిన అన్యాయం ఏ పాటిదన్నారు జేసీ.

 కివీస్ కు చుక్కలు చూపించిన భారత్

సూపర్ ఓవర్ మొదలైంది ఇలా..

Latest Updates