జగన్‌ను మార్చాలంటే వాళ్ల తాత రాజారెడ్డే దిగి రావాలి

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను ఎవరూ మార్చలేరన్నారు. జగన్ ను  మార్చాలంటే వాళ్ల తాత రాజారెడ్డే పై నుంచి దిగి రావాలని..లేదా కోర్టులు తలంటాలన్నారు.  జగన్ వాళ్ల తాత రాజారెడ్డి మాటే వింటాడని  దివంగత రాజశేఖర్ రెడ్డి స్వయంగా తనతో చెప్పాడన్నారు.  రాజారెడ్డి ఒకసారి జగన్ కల్లోకి వచ్చి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పాలన్నారు. చంద్రబాబుపై పగ ఉంటే ఆయనపై చూపాలి కానీ భూములిచ్చిన రాజధాని రైతుల జీవితాలతో ఆడుకోవదన్నారు. జగన్ దుర్మార్గుడు, దుష్టుడు, మనస్సు లేనివాడన్నారు. జగన్ తన తీరు మార్చుకోవాలన్నారు.

చంద్రబాబు కమ్మ జాతిని నాశనం చేశారు: జేసీ

మాజీ సీఎం చంద్రబాబు కమ్మ జాతిని పూర్తిగా నాశనం చేశారని అన్నారు జేసి. కమ్మ జాతిని చంద్రబాబు  కృష్ణా, గోదావరిలో కలిపారన్నారు. అమరావతిలో చంద్రబాబుకు భూములు ఉన్నాయన్నారు. అయన భూములు లేవని చెప్పడం అబద్ధమన్నారు. తాను ఎవరికి భయపడనన్నారు.

Latest Updates