ఏపీ ఎన్నికల ఖర్చు 10 వేల కోట్లు: జేసీ దివాకర్ రెడ్డి

ఏపీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి రూ.10 వేలకోట్లు ఖర్చు చేశాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చు అంచనాలు దాటిపోయిందని, ప్రతి నియోజకవర్గంలో కనీసం రూ. 50 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదిక దగ్గర మీడియాతో ఆయన మాట్లాడారు. “ఇదంతా అవినీతి సొమ్మే. ఓటర్లు కూడా ఎన్నికల్లో ఓటుకు ఒక నాయకుడు రెండు వేలు ఇచ్చాడు.. మీరు ఇంకా ఎక్కువ ఇవ్వాలని అడిగే స్థితికి చేరుకున్నారు. రాయలసీమలో తినడానికి తిండి లేకున్నా కొందరు ఓటుకు రూ.5 వేలు డిమాండ్ చేశారు. దేశంలో ఇంత అవినీతి జరుగుతుంటే చూస్తూ ఉండాలా? ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకుని ఈ ఖర్చును తగ్గించాలి. నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్ని కల్లో కేవలం రూ. 7 లక్షలు మాత్రమే ఖర్చుచేశా. రెండోసారి ఎమ్మెల్యే ఎన్నికల ఖర్చు రూ.20 లక్షలు దాటింది. ఇక అప్పటి నుంచి ఎన్నికల ఖర్చు తడిసి మోపెడయ్యింది. ఈ ఎన్నికల్లో ఒక్కోఅభ్యర్థు ల కనీస ఖర్చు రూ. 25 కోట్లకు చేరింది” అని అన్నారు. త్వరలో ఎన్నికల సంస్కరణల కోసం మేధావులు, నాయకులతో కలిసి హైదరాబాద్ లో సమావేశమై చర్చిస్తానన్నారు.

Latest Updates