కేసీఆర్ ఆంధ్రాకొస్తే చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయం : జేసీ

సంచి, పంచ్ లతో నాయకులకు ఏమీ లాభం ఉండదని.. రైతుకు లాభం చేసినవాళ్లే గెలుస్తారని అన్నారు ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. తెలంగాణలో రైతు విజయం సాధించాడని చెప్పారు. రైతుబంధు పథకాలే కేసీఆర్ ను గెలిపించాయని అన్నారు. దేశంలో ఎవరూ చేయనంతగా రైతుల కోసం కేసీఆర్ మంచి పనులు చేశారన్నారు. రైతులకు లాభం చేకూర్చే ప్రభుత్వాలే విజయం సాధిస్తాయన్నారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ కు కూడా వర్తిస్తుందని అన్నారు. హైదరాబాద్ లో సూటు, బూటు వేసుకుని తిరిగే వాళ్లు ఓటువేయడానికి బద్దకించారని అన్నారు. తెలంగాణలో చంద్రబాబును బూచిని చేశారని అన్నారు. ఒకవేళ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేస్తే టీడీపీ కే లాభం అని.. చంద్రబాబు మళ్లీ సీఎం అవడం ఖాయం అని చెప్పారు.

Latest Updates