మరో ఏడాదిలో ఏపీ సీఎంగా వైఎస్ భారతి!

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది లేదా ఏడాదిన్నరలో ఏపీ సీఎంగా వైఎస్ భారతీ ప్రమాణం చేస్తారని జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ఏపీ రాజధానిని మార్చాలనే ఆలోచన కుల ద్వేషం వల్లే వచ్చిందని ఆయన అన్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే రాజధానిని మార్చాలని జగన్ అనుకున్నారని జేసీ అన్నారు. ఏపీలో కృష్ణా-గోదావరి నదుల వల్లే అమరావతి ప్రాంతంలో డబ్బు ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.  రాజధాని వస్తుందనే నమ్మకంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా భూముల కొనుగోలు జరిగిందని జేసీ అన్నారు. అయితే కమ్మ వాళ్లు మాత్రమే ఆ భూములు కొనలేదని.. చాలా మంది అక్కడ భూములు కొన్నారని ఆయన అన్నారు. గత ఏడు నెలలుగా విజయ సాయిరెడ్డి ఢిల్లీ-విశాఖల మధ్య చాలా ఎక్కువసార్లు తిరిగారని.. ఎందుకు తిరిగారో ఆయన సమాధానం చెప్పాలని జేసీ డిమాండ్ చేశారు.

రాజధాని ప్రాంతంలోని భూములను డబ్బులున్న వాళ్లొచ్చి కొంటే రైతులకు ఏం నష్టం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఒకే ఒక్క డీల్ చేసినందుకు జగన్‌కు వెయ్యి కోట్లు వచ్చాయని వార్తలు వస్తున్నాయని ఆయన అన్నారు. దాంతో గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో చెల్లించేశారని జేసీ అన్నారు. కేసీఆర్ ఆర్ధిక సాయం చేసినందుకు జగన్ గురు భక్తి చాటుకున్నారని జేసీ వ్యాఖ్యానించారు. ఏపీకి మూడు రాజధానులు చేయమని జగన్‌కు సలహా ఇచ్చిందే కేసీఆర్ అని జేసీ అన్నారు. సీఎం జగన్ పనులను చూసి.. ఏపీలోని పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని ఆయన అన్నారు. ఏపీపై నమ్మకం, విశ్వాసం పోయిందని.. అందుకే పరిశ్రమలు పోయాయని ఆయన అన్నారు. జగన్ ప్రజలలో తనకున్ననమ్మకాన్ని కొల్పోయాడని జేసీ అన్నారు.

For More News..

బాత్రూంలో ఉన్న ఫొటోలతో మాజీ మిస్ ఇండియాకు వేధింపులు

Latest Updates