BS3 వాహనాలు BS4గా రిజిస్ట్రేషన్.. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

మాజీ  ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్  రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయనతో పాటు కొడుకు అస్మిత్  రెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించారు.  బీఎస్ -3 వాహనాలను బీఎస్- 4గా రిజిస్ట్రేషన్  చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటి వరకు 154 వాహనాలు నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్  చేయించినట్లు గుర్తించారు.  వీటికి సంబంధించిన ఫేక్  ఎన్ ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్ ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Latest Updates