అప్పుడూ.. ఇప్పుడూ జగన్ మా అబ్బాయే.. కానీ న్యాయపోరాటం తప్పదు

  • మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
  • జగన్ పాలనకు 100కు 150 మార్కులు వేస్తా

గుంటూరు: సీఎం జగన్ పాలన జనరంజకంగా సాగుతోందని, ఆయన పాలనుకు 100కు 150 మార్కులు వేస్తానని అన్నారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ జగన్ తమ అబ్బాయేనని, కానీ న్యాయ పోరాటం చేయక తప్పడం లేదని చెప్పారు. బుధవారం గుంటూరులో జేసీ మీడియాతో మాట్లాడారు. ఇటీవల దివాకర్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేయడంపై ఆయన ప్రభుత్వాన్ని తప్పుపట్టారు.

జరిమానాలతో పోయేదానికి సీజ్ చేయడమేంటి?

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రావెల్స్‌ బస్సులు ఉన్నా.. సీఎం జగన్‌కు తన బస్సులే కనిపిస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 31 బస్సులను సీజ్ చేశారని చెప్పారు జేసీ. దీనిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్‌ చేశారని, జరిమానాలతో పోయే తప్పిదాలకు సీజ్‌ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారాయన. అయితే జగన్‌ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మా అబ్బాయే అని అన్నారాయన.

 

Latest Updates