ఎలక్షన్ కమీషన్ కు సవాలు విసిరిన ధీరుడు

తమిళనాడుకు చెందిన ఓ మాజీ పోలీస్ ఆఫీసర్ ఎలక్షన్ కమీషన్ కు సవాలు విసిరాడు. జేబమని మోహన్ రాజ్  అనే మాజీ పోలీస్ తమిళనాడులోని పెరంబూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేస్తున్నారు. ఈ సారి అక్కడ ఉపఎన్నిక జరుగనుంది.  ఇందుకుగాను.. ఎన్నికల కమీషన్ కు అఫిడవిట్ ను ధాఖలు చేశారు.. అందులో తన ఆస్తి రూ. ఒక లక్ష 74 వేల కోట్ల నగదు ఉన్నట్లు చూపించాడు. ప్రపంచ బ్యాంకు నుంచి 4లక్షల కోట్లను అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు.  ఆయనకు జెబమాని జనతా పార్టీ అనే రాజకీయ పార్టీ ఉంది. ఆ పార్టీ నుంచే మోహన్ రాజ్ పోటీ చేస్తున్నారు.

మోహన్ రాజ్ ఎన్నికల కమీషన్ లో ఉన్న లూప్ హోల్స్ ప్రజలకు తెలియజెప్పడానికి మాత్రమే తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిపారు. నిజానికి ఎన్నికల బరిలో ఉన్న వాళ్లు తమకు చెందిన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పొందుపరచవలసి ఉంటది. అయితే అది నిజమా కాదా అని ఎన్నికల కమీషన్ దర్యాప్తు చేయదు. ఈ లూప్ హోల్ కారణంగానే చాలా మంది నాయకులు తప్పుడు ఆస్తులను చూయిస్తున్నారు. ఇందులో బాగంగానే..  మోహన్ రాజ్ 1.74లక్షల కోట్లు తన దగ్గర ఉన్నట్లు తెలిపాడు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం.. కానీ దర్యాప్తు చేసేవారు ఎవరు.. అన్నదే మోహన్ రాజ్ ప్రశ్న.

jebamani-mohanraj-claiming-he-has-rs-1-44-lakh-crores-cash-in-affidavit

Latest Updates