JEEలో సత్తా చాటిన తెలుగు స్టూడెంట్స్ : ST విభాగంలో హైదరాబాద్ ఆణిముత్యం

JEEAdvancedజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(JEE) అడ్వాన్స్‌ డ్-2018 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచూపారు. OBC నాన్ క్రీమీలేయర్ విభాగంలో, రిజర్వుడ్ క్యాటగిరీలో టాప్ ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించారు. టాప్ టెన్ ర్యాంకుల్లో ఆరింటిని తెలుగు విద్యార్థులే కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. అన్ని క్యాటగిరీల్లో కలిపి టాప్-100 ర్యాంకుల్లో 70 ర్యాంకుల్ని మనవాళ్లు కొల్లగొట్టారు. టాప్ ర్యాంకుల్ని రాష్ట్రంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు సాధించగా, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులూ అత్యుత్తమ ర్యాంకులు సాధించడం విశేషం.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) ఆదివారం (జూన్-11 )విడుదల చేసిన JEE అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో హర్యానాలోని పంచకులకు చెందిన ప్రణవ్ గోయల్ అఖిల భారత స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మొత్తం 360 మార్కులకు ప్రణవ్ 337 మార్కులు స్కోర్ చేశాడు. రాజస్థాన్‌ లోని కోటకు చెందిన సాహిల్ జైన్ రెండో ర్యాంకును, ఢిల్లీకి చెందిన కైలాస్ గుప్తా మూడో ర్యాంకును కైవసం చేసుకున్నారు. బాలికల విభాగంలో రాజస్థాన్‌ లోని కోటాకు చెందిన మీనాల్ పరేఖ్ 318 మార్కులతో తొలి స్థానం దక్కించుకున్నారు. ST విభాగంలో హైదరాబాద్ ఆణిముత్యం జాటోత్ శివ తరుణ్ తొలి ర్యాంకును కొల్లగొట్టారు. OBC నాన్ క్రీమీలేయర్ విభాగంలో తెలుగు విద్యార్థి విజయవాడకు చెందిన మావూరి శివకృష్ణ మనోహర్ తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు.

అలాగే తెలుగు విద్యార్థులు అన్ని క్యాటగిరీల్లో కలిపి జీవీ శ్రీవర్ధన్ 3వ ర్యాంకు, గట్టు సాయిభాస్కర్ 5వ ర్యాంకు, కంటె వినీష్ 6వ ర్యాంకు, కేవీఆర్ హేమంత్‌ కుమార్ చౌడిపల్లి 7వ ర్యాంకు, ఎంఎల్ సాయివర్థన్ 9వ ర్యాంకు, ఎల్ శ్రీనాథ్ 10వ ర్యాంకు సాధించారు. ఎస్సీ క్యాటగిరిలో రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ఆయుష్ కదమ్ తొలి ర్యాంకును సాధించారు. మే 20న దేశవ్యాప్తంగా జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1.55 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 18,138 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 2076 మంది బాలికలున్నారు.

Posted in Uncategorized

Latest Updates