
దేశ వ్యాప్తంగా IITల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే JEE అడ్వాన్స్డ్ పరీక్ష 2021 తేదీని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ పరీక్ష జులై 3న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది IIT ఖరగ్ పూర్ పరీక్షను నిర్వహిస్తుందని తెలిపారు. ఇవాళ(గురువారం) సాయంత్రం వర్చువల్ విదానంలో మాట్లాడిన పోఖ్రియాల్… ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు ప్రిపరేషన్‌కు తగిన సమయం ఉందని తెలిపారు. JEE మెయిన్ పరీక్షల తేదీలు, CBSC 10, 12వ తరగతి పరీక్షల ప్రారంభం, ముగింపు తేదీలను ఇప్పటికే ఆయన ప్రకటించారు.
IITల్లో ప్రవేశానికి అర్హతలను కూడా తెలిపారు మంత్రి రమేశ్ పోఖ్రియాల్. విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్ల క్రమంలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు 5 శాతం మార్కులు తప్పనిసరి నిబంధనను ఈసారి కూడా రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కరోనా కారణంగా గతేడాది కూడా ఈ రూల్ ను సడలించారు.