
- రాష్ట్రం నుంచి అటెండ్ కానున్న 73,782 మంది
- తెలుగులో రాసేందుకు 374 మంది ఆసక్తి
హైదరాబాద్, వెలుగు: ఐఐటీ, ఎన్ఐటీతో పాటు పలు జాతీయ విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ఫస్ట్ సెషన్ ఎగ్జామ్స్మంగళవారం నుంచి మొదలు కానున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జామ్స్ ఈ నెల 26న ముగుస్తాయి. రోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలుంటాయి. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్ట్ లో ఎగ్జామ్స్ జరుగుతాయి. సోమవారం బీఆర్క్, ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ 2 ఎగ్జామ్.. తర్వాత మూడు రోజులూ బీఈ, బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం పేపర్1 ఎగ్జామ్స్ ఉంటాయి. రాష్ట్రం నుంచి 73,782 మంది, ఏపీ నుంచి 87,797 మంది ఈ ఎగ్జామ్స్కు హాజరవుతున్నారు. తొలిసారిగా ఎన్టీఏ పలుప్రాంతీయ భాషల్లో జేఈఈ నిర్వహిస్తోంది. దీంతో తెలుగులోనూ రాసేందుకు స్టూడెంట్స్ కు అవకాశం దక్కింది. అయితే 374 మంది మాత్రమే తెలుగులో రాసేందుకు ఆప్షన్ ఇచ్చుకున్నారు. రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎగ్జామ్స్ సెంటర్లు పెరిగాయి. స్టేట్లో 12 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్ తదితర కేంద్రాల్లో సెంటర్లున్నాయి. మార్చి15 నుంచి 18 వరకు రెండో సెషన్, ఏప్రిల్ 27 నుంచి 30 వరకు మూడో సెషన్, మే 24 నుంచి 28 వరకు నాల్గో సెషన్ లో జేఈఈ మెయిన్ జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
తెలంగాణ, ఏపీ ఇంటర్ బోర్డుల అధికారులపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ నీళ్ల లెక్క సరిదిద్దాలె..కేఆర్ఎంబీకి తెలంగాణ లెటర్
ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కడ్తోంది..కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు ఫిర్యాదు
మన హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్