బ్రేకింగ్: నీట్, జేఈఈ ‌పరీక్షలు వాయిదా: కొత్త డేట్స్ ఇవే..

న్యూఢిల్లీ: ఈ నెల 18 నుండి 23 వరకు జరగాల్సిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌(JEE ) మెయిన్స్‌, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (IIT) ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. అదేవిధంగా ఈ నెల 26 న జరగాల్సిన నేషనల్‌ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌(NEET ) కూడా వాయిదా పడింది. ఈ పరీక్షలను సెప్టెంబర్‌ నెలలో నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. ‌JEE , IIT ప‌రీక్ష‌లు ప్టెంబర్ 1 నుండి 6 వ తేదీ వరకు జరుగుతాయ‌ని, NEET సెప్టెంబర్ 13 కి వాయిదా ప‌డిన‌ట్లు ఆయ‌న తెలిపారు. JEE అడ్వాన్స్డ్ సెప్టెంబర్ 27 కి వాయిదా ప‌డిన‌ట్టు ప్ర‌క‌టించారు. క‌రోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలిపారు.

Latest Updates