వచ్చే ఏడాది నుంచి ప్రాంతీయ భాషల్లోనూ JEE మెయిన్స్‌

 

వచ్చే ఏడాది నుంచి JEE మెయిన్స్‌ను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు (JAB) ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం​ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష JEE మెయిన్‌ను ఇంగ్లీష్‌, హిందీ, గుజరాతీ భాషల్లోనే నిర్వహిస్తున్నారు.

2021 నుంచి భారత్‌లోని పలు ప్రాంతీయ భాషల్లో JEE మెయిన్‌ పరీక్షలను నిర్వహించాలని JAB నిర్ణయించిందని రమేష్‌ పోఖ్రియాల్‌ గురువారం ట్వీట్‌ చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దిశగా మరిన్ని నిర్ణయాలకు ఇది ఉపయోగపడనుంది. భారత్‌లో వైద్య విద్య ప్రవేశ పరీక్షల నీట్‌ను మాత్రమే 11 భాషల్లో నిర్వహించనున్నారు.

Latest Updates