తొలగించాల్సింది ఇంటర్ బోర్డును కాదు సీఎంనే:జీవన్ రెడ్డి

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 15 ఏళ్ళు ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు నిర్వహించిన మాగ్నటిక్ సంస్థను తప్పించి.. ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు బాధ్యతలు అప్పగించడం వెనక మతలబు ఏంటని ప్రశ్నించారు. గ్లోబరీనాపై ఎందుకు  చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. తొలగించాల్సింది ఇంటర్ బోర్డునో రెవెన్యూ శాఖను  కాదని..ముఖ్యమంత్రినే తొలగించాలని అన్నారు. విద్యార్థుల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్కలేదా? అని ప్రశ్నించారు.  కేటీఆర్ కుమారునికో, మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుమారునికో, ఎంపీ కవిత కుమారునికో ఇలాంటి అన్యాయం జరిగితే ఊరుకుంటారా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Latest Updates