అధికారంలోకి వ‌స్తే ప్రాణ‌హిత‌ చేవేళ్ల‌కు జాతీయ హోదా క‌ల్పిస్తాం.

Jeevan reddy Press meet at Jagityala

రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 16 స్థానాల‌ను గెలిపిస్తే చ‌రిత్ర సృష్టిస్తామంటున్న టీఆర్ఎస్ గ‌తంలో 15 మంది ఎంపీ స్థానాల‌తో ఏం సాధించిందని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీమంత్రి జీవ‌న్ రెడ్డి అన్నారు. ఈ రోజు జ‌గిత్యాలలోని త‌న నివాసంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందిందని అన్నారు. ITIR ప్రాజెక్టుతో గతంలో యుపీఏ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కృషి చేస్తే.. TRS ప్రభుత్వం ఆ ప్రాజెక్టు గురించి స‌రిగా పట్టించుకోలేదన్నారు. తుమ్మిడి హెట్టి, ఇతర ప్రాజెక్టులకు జాతీయ హోదా టీఆర్ఎస్ అసమర్ధత తోనే రాలేదన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యర్థి కావాలని.. త‌నకు మద్ధతు తెలిపిన వారంద‌రికి ఈ సంద‌ర్భంగా జీవ‌న్ రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సారి కేంద్రంలో తాము అధికారంలోకి వ‌స్తే ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు జాతీయహోదా కల్పిస్తామ‌ని అన్నారు. . ప్ర‌జా సంక్షేమం పట్ల టీఆర్ఎస్‌ పార్టీ కి చిత్తశుద్ధి లేద‌ని, ఈ ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఆ పార్టీ గెలువబోయే ప్రతి సీటు ఎన్డీయేలోకే వెళ్తుందని అన్నారు. ఏపీ ఎన్నికలతో త‌మకు ఎలాంటి సంబంధం లేదని జీవ‌న్ రెడ్డి ఈ స‌మావేశంలో తెలిపారు.

అంత‌కుముందు ముత్యంపేట‌లో ప్ర‌సంగించిన జీవ‌న్ రెడ్డి.. స్థానికంగా ఉన్న‌ షుగర్ ఫ్యాక్టరీ తెరవకుండా చెరుకును ఇక్కడి నుంచి గాయత్రీ ఫ్యాక్టరీకి తీసుకు వెళ్తున్నారని ఆరోపించారు. పసుపు రైతులకు క్వింటాలుకు 2 వేల బోనస్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నిక నియమావళి వచ్చిన తరువాత కూడా అధికారులతో కవిత సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నార‌ని. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాదా? అని జీవ‌న్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు.

Latest Updates