అటవీ అధికారిపై దాడి ప్రభుత్వ కుట్ర : జీవన్ రెడ్డి

అటవీ శాఖ మహిళా అధికారి అనితపై సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ దాడిని ఖండించారు పీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అటవీ శాఖ అధికారినిపై… జెడ్పీ చైర్ పర్సన్ కృష్ణ దాడి చేయడం కుట్ర అని ఆయన ఆరోపించారు. పోడు భూములకు ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. పోడు భూమి రక్షణకు ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

“ఒకపక్క ప్రభుత్వం పోడు భూముల్లో చెట్లను నాటాలని అదేశిస్తుంటే…. మరో పక్క ఎమ్మెల్యే అనుచరులు అధికారులపై దాడి చేస్తున్నారు. ఇదేం పద్ధతి.. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి” అని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

2008, 09లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోడు భూములపై గిరిజనులకు అధికారాలు ఇచ్చిందన్నారు జీవన్ రెడ్డి. కానీ పోడు భూముల నుంచి గిరిజనులను తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనీ..ఇప్పుడు గిరిజనులను బలవంతంగా పోడు భూముల నుంచి పంపించడం దురదృష్టకరం అన్నారాయన. గిరిజనులను అటవీ భూములనుంచి వెళ్లగొట్టి.. హరితహారం మొక్కలు పెంచేవిధంగా అటవీశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ప్రభుత్వానిది ఓ పద్ధతి.. ఎమ్మెల్యే అనుచరులది మరో పద్ధతిలో ఉండటం వెనుక కుట్ర దాగుందని జీవన్ రెడ్డి చెప్పారు.

Latest Updates