జగన్ కే జై కొడుతున్న సినీస్టార్స్

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి సినీస్టార్స్ లుక్ వచ్చింది. టాలీవుడ్ కి చెందిన పలువురు నటులు జగన్ కే జై కొడుతున్నారు. ఇప్పటికే  పోసాని కృష్ణమురళీ, మోహన్ బాబు, ఫృద్వీ, కృష్ణుడు, అలీ, జయసుధ, శివాజీరాజా, చిన్నికృష్ణ, కోన వెంకట్, SVకృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, చోటా కె.నాయుడు, రాజా రవీంధర్, తనీష్, జోగి నాయుడు లాంటి నటులు వైసీపీలో చేరి జోరుగా ప్రచారం చేస్తుండగా..సోమవారం మరికొంత మంది సినీ స్టార్ వైసీపీలో చేరారు. ప్రముఖ నటుడు రాజశేఖర్‌, ఆయన భార్య జీవిత, యాంకర్‌, నటి శ్యామల, ఆమె భర్త నర్సింహారెడ్డి, నటి హేమ తదితరులు పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వైఎస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Latest Updates