జీతాల కోత నుంచి వారిని మినహాయించాలి

కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రభావం పడుతున్న క్ర‌మంలో .. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిరయ్ణించిన విష‌యం తెలిసిందే. అయితే.. జీతాల కోతపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీతాల కోత నుంచి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను మినహాయించాలని సీఎం కేసీఆర్‌కు రిక్వెస్ట్ చేశారు.

డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఏ రాష్ట్రంలో కోతలు విధించడం లేదని అన్నారు. కోతలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చించిందా.. అని ఆయన ప్రశ్నించారు. పెన్షన్ డబ్బులతో బతికేవాళ్ళనూ ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. కోతల నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ పునరాలోచించాలని జీవన్ రెడ్డి సూచించారు.

Latest Updates