
ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ పర్యావరణ పరిరక్షణ కోసం భారీ విరాళం ప్రకటించారు. క్లైమేట్ చేంజ్ సమస్యను నివారించడం కోసం రూ. 71 వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) నిధులను ఖర్చు చేయనున్నట్టు సోమవారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. క్లైమేట్ చేంజ్‌పై పోరాటం కోసం ‘బెజోస్ ఎర్త్ ఫండ్’ కింద ఈ నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సైంటిస్టులు, యాక్టివిస్టులు, ఎన్జీవోలు చేసే ఎలాంటి ప్రయత్నానికైనా తాము బెజోస్ ఎర్త్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందచేస్తామన్నారు. వాతావరణ మార్పు సమస్యలను నివారించడంలో అమెజాన్ కంపెనీ తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న పాలసీలు ఏమాత్రం బాగాలేవని, పర్యావరణ పరిరక్షణ కోసం మరింత గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందంటూ సొంత కంపెనీ ఉద్యోగులే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఫండ్‌ను ప్రకటించడం విశేషం.