జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా నాని అభిమాన హీరో

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా జెర్సీ. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 19న రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్ లో బిజీగా ఉంది సినిమా యూనిట్. ఈ క్రమంలోనే  ఈ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తుంది జెర్సీ టీమ్. ఈ కార్యక్రమానికి నాని ఎంతో అభిమానించే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ కానున్నాడు. ఈ విషయాన్ని టీమ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలుపుతూ వెంకీ ఫొటోను పోస్ట్ చేసింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మించిన ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్.

Latest Updates