జెర్సీ : మూవీ రివ్యూ

రివ్యూ : జెర్సీ

రన్ టైమ్ : 2 గంటల 40 నిమిషాలు

నటీనటులు: నాని,శ్రద్దా శ్రీనాథ్,సత్యరాజ్,మాస్టర్ రోనిత్, సంపత్ రాజ్,ప్రవీణ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: సాను

మ్యూజిక్ : అనిరుధ్ రవిచంద్రన్

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

రచన,దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి

రిలీజ్ డేట్: ఏప్రిల్ 19,2019

కథేంటి?

ఈ సినిమా గౌతమ్ అనే ఓ రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరి..క్రికెట్ కోసం తను ఎలాంటి చాలెంజెస్ ను ఫేస్ చేశాడు.తన భార్య,కొడుకు ల కోసం ఎలాంటి డిసిషన్ తీసుకున్నాడు.చివరగా తను అనుకున్నది సాధించాడా లేదా అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

నాని ఈ సినిమాతో మరో మెట్టు ఎదిగాడని చెప్పొచ్చు.ఇలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకోవడమే రిస్క్.కానీ దాన్ని తనకున్న యాక్టింగ్ కెపాసిటీతో నెట్టుకొచ్చాడు.చాలెంజింగ్ రోల్ ను సమర్థవంతంగా పోషించి వహ్వా అనిపించాడు.హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ కు మంచి పాత్ర దక్కింది.తన మెచ్యూర్డ్ నటనతో వన్నె తెచ్చింది.నాని కొడుకుగా నటించిన మాస్టర్ రోనిత్ అందరినీ ఆకట్టుకుంటాడు.బాహుబలి తర్వాత సత్యరాజ్ కు మంచి పాత్ర దక్కింది.దానికి ఆయన వంద శాతం న్యాయం చేశాడు.సంపత్ రాజ్,ప్రవీణ్,హరీష్ కళ్యాణ్ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

టెక్నీషియన్స్ వర్క్:

సాను సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.కీలకమైన క్రికెట్ సీన్లను అధ్భుతంగా ప్రజెంట్ చేశాడు.అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు మరో బలం.తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశాడు.ఎడిటింగ్ కాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. ఆర్ట్ వర్క్ బాగుంది.నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా తీసారు.గౌతమ్ తిన్ననూరి డైలాగులు మెప్పిస్తాయి.

విశ్లేషణ:

‘‘జెర్సీ’’ రీసెంట్ గా వచ్చిన చాలా మంచి సినిమాల సరసన నిలుస్తుందనడంలో సందేహం లేదు.డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ గా అనుభవం తక్కువే అయినా..చాలెంజింగ్ సబ్జెక్ట్ ను తీసుకొని తన ఎక్సిక్యూషన్ తో మెస్మరైజ్ చేశాడు.ఫస్టాఫ్ కాస్త్ స్లోగా ఉందని అనిపించినా..ఎమోషన్ ఎక్కడా మిస్సవలేదు.ఇక సెకండాఫ్ మొత్తం గ్రిప్పింగ్ గా నడిపించి ఆకట్టుకున్నాడు.. సినిమా ఇంత బాగా రావటానికి అతని స్క్రీన్ ప్లే నే కారణం.ప్రతీ క్యారెక్టర్ ను అధ్బుతంగా ప్రజెంట్ చేసి వాళ్ల నుంచి ఎమోషన్ రాబట్టుకున్న తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. టీమ్ లో సెలక్టయినపుడు నాని చేత ఎమోషన్ పండించే సీన్ అయితే అధ్బుతం.అలాంటివి సెకండాఫ్ లో ఎక్కువున్నాయి.అందుకే ఎక్కడా గ్రాఫ్ పడిపోలేదు.క్రికెట్ మ్యాచ్ సీన్లు ఎక్కువ ఉండటం వల్ల చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది మూవీ.ఏం జరుగుతుందో తెలిసే కథే అయినా..క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చాడు.అది డైరెక్టర్ ప్రతిభ కు కొలమానం..సినిమా చూసాక ఒక సంతృప్తి కలుగుతుంది.ఓ హార్టఫుల్ ఫీల్ తో బయటకు వస్తారు ఆడియన్స్..నాని నటన,టెక్నీషియన్స్ సపోర్ట్,దర్శకుడి టాలెంట్..ఇలా టీమ్ అందరూ కలిసి..ఈ క్రికెటర్ అర్జున్ ఎమోషనల్ జర్నీని సక్సెస్ ఫుల్ గా నడిపించారు.

 

Latest Updates