టీటీడీకి టాటా ఇంట్రాను విరాళంగా ఇచ్చిన జెస్పా

జెస్పా ఇండస్ట్రీ, టాటా ఇంట్రా అనే 6 లక్షలు విలువ చేసే వాహనాన్ని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చేతులు మీదగా  టీటీడీకి విరాళంగా అందిచారు. ముందుగా వాహనాన్ని ప్రధాన ఆలయం ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వాహన తాళాలను, పత్రాలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందచేశారు.

అనంతరం ఏపి మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ టీటీడీ కి వాహనాన్ని విరాళంగా అందించిన జాస్పర్ ఇండస్ట్రీకి అభినందనలు తెలియచేసారు. తిరుమలలో కాలుష్యాన్ని అరికట్టేటందుకు టీటీడీ అడుగులు వేయడం శుభపరిణామం అన్నారు. బ్యాటరీ వాహనాలపై టాటా వారితో టీటీడీ ఛైర్మెన్ సంప్రదింపులు చేసారని, వారు కూడా దీనిపై స్పందించి ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు అందిస్తామని అనడంపై సంతోషం వ్యక్తం చేశారు మంత్రి. ముఖ్యంగా తిరుమలకు రోజుకు లక్షలాది మంది భక్తులు వచ్చే బస్సుల్లో కూడా మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సుల స్థానంలో బ్యాటరీ వాహనాలను ప్రవేశ పెట్టి కాలుష్యం నుండి తిరుమలను కాపాడాలని ముఖ్యమంత్రికి విన్నవించడం జరిగిందన్నారు. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందిచారని త్వరలోనే తిరుమల తిరుపతికి మధ్యలో మొదటి విడతగా 150  బ్యాటరీ బస్సులను కేటాయించే అవకాశం ఉందని రవాణశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.

jespa industry donated 6 lakhs worth of Tata Intra vehicle to TTD

Latest Updates