జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగి సూసైడ్

జెట్‌ ఎయిర్ వేస్ లో పని చేసేసీనియర్‌ టెక్నీషియన్‌ శైలేశ్ సింగ్‌(45)శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలోని పాల్గర్‌ జిల్లా లోని నల్సో పోరాలోతన నివాసం నాలుగో ఫ్లోర్ నుంచి దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. శైలేశ్సింగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. కొద్దిరోజులుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. డిఫ్రెషన్​లో ఉన్నాడని తోటి ఉద్యోగులు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎక్కువవ్వడంతోనే శైలేశ్ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.

Latest Updates