ఇంకా ఇరుక్కున్న ‘జెట్​’ గోయల్

  • జెట్ బుక్స్‌‌పై స్వతంత్ర దర్యాప్తు
  • ఆడిట్‌‌లో తేడాలు   
  • గోయల్‌‌కు 19 రిజిస్ట్రర్ ప్రైవేట్ కంపెనీలు

న్యూఢిల్లీ : జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్, దాని వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌‌ మరింత ఇరకాటంలో పడిపోతున్నారు. ఈ ఎయిర్‌‌‌‌లైన్‌‌కు చెందిన పద్దులపై స్వతంత్ర దర్యాప్తు చేయించేందుకు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిద్ధమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్యకలాపాలు సాగించేందుకు నిధులు లేక ఆగిపోయిన ఈ ఎయిర్‌‌‌‌లైన్స్​లో ఫండ్స్‌‌ దారి మళ్లింపు జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. గత వారమే ఈడీ గోయల్‌‌ను విచారించింది. ఆ తర్వాత ఎస్‌‌బీఐ జరిపిన ఆడిట్‌‌లో పలు తేడాలు ఉన్నాయని ఈడీ గుర్తించినట్టు ఓ ఇంగ్లీష్ పేపర్ రిపోర్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ ఎలా ప్రారంభించాలనే విషయంపై ఏజెన్సీ నిర్ణయించాల్సి ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆగస్ట్‌‌లో గోయల్‌‌కు వ్యతిరేకంగా ఆయన నివాసాల్లో, ఆపీసుల్లో తనిఖీలు చేపట్టిన ఈడీ గత వారం కూడా ఫారిన్‌‌ ఎక్సేంజ్‌‌ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను ముంబైలోని గోయల్ నివాసాల్లో తనిఖీలు జరిపింది. ఆగస్ట్‌‌లో జరిగిన ఈడీ సెర్చ్‌‌ల్లో గోయల్ ముంబై నివాసం, గ్రూప్ కంపెనీలు, జెట్ ఎయిర్‌‌‌‌వేస్ డైరెక్టర్ల నివాసాలు, ఆఫీసులు ఉన్నాయి. సీనియర్ ఈడీ అధికారుల సమాచారం ప్రకారం, గోయల్‌‌కు ప్రైవేట్‌‌గా19 రిజిస్ట్రర్‌‌ కంపెనీలున్నాయి. వాటిలో ఐదు  విదేశాల్లో ఉన్నాయి. రూ.18 వేల కోట్ల ఫ్రాడ్ చేసిన గోయల్‌‌ విచారణకు సహకరించడం లేదని కేంద్రం ఈ ఏడాది ఆగస్ట్‌‌లో ఢిల్లీ హైకోర్ట్‌‌కు పేర్కొంది. కాగా, గోయల్, ఆయన భార్య అనిత జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ బోర్డు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ‌‌

గోయల్ ప్రాపర్టీలపై పలుమార్లు రైడ్….

మూత పడిన ఈ క్యారియర్‌‌‌‌కు చెందిన లాయల్టీ ప్రొగ్రామ్‌‌లోకి వచ్చిన ఫారిన్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ గురించి నరేష్ గోయల్‌‌ను గతంలో ఈడీ విచారించింది. ఏజెన్సీకి చెందిన బల్లార్డ్ పీర్ ఆఫీసులో గోయల్‌‌ను ప్రశ్నించింది. జెట్‌‌కు, గోయల్‌‌కు, ఆయన సన్నిహితులకు చెందిన 10 ప్రాపర్టీలలో పలుమార్లు సోదాలు చేసిన ఈడీ ఫెమా ఉల్లంఘన చట్టం కింద గోయల్‌‌ను విచారించింది. గత నెలలో గోయల్‌‌కు చెందిన టైల్ విండ్స్ కార్పొరేషన్‌‌లో ఇన్వెస్ట్ చేసిన హస్ముఖ్ గార్డి నివాసాల్లో కూడా ఈడీ రైడ్స్ చేసింది.

Jet Airways founder Naresh Goyal in trouble as ED may go for independent audit

Latest Updates