విదేశాలకు జెట్ విమానాలు బంద్

25 ఏళ్ల చరిత్రలో అత్యంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్వేస్‌‌ తన అంతర్జాతీయ సర్వీసుల రద్దును సోమవారం దాకా పొడిగించింది. లిక్విడిటీ కొరత మరింత తీవ్రమైన నేపథ్యంలో ఈ సర్వీసుల రద్దు అనివార్యమైంది. జెట్‌ ఎయిర్వేస్‌‌ నిర్వహణను అప్పగించేందుకు ఎస్‌‌బీఐ ఇప్పటికే బిడ్‌ లను పిలిచింది. బిడ్‌ ల దాఖలుకు గడువు శుక్రవారంతో ముగిసింది. ప్రస్తుతం జె ట్‌ ఎయిర్వేస్‌‌ రోజువారీ కార్యకలాపాల నిర్వహణ ఎస్‌‌బీఐ చేతిలోనే ఉంది. జె ట్‌ ఎయిర్వేస్‌‌ ఒరిజినల్‌ ప్రమోటర్ నరేష్‌ గోయెల్‌, యూఏఇ ఎయిర్ లైన్స్​ ఎతిహాద్‌ ఎయిర్వేస్‌‌, ఎయిర్‌‌ కెనడాలు కూడా తాజాగా జెట్‌ కోసం బిడ్‌లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సేవలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు జెట్‌ ఎయిర్వేస్‌‌ గురువారం ప్రకటించింది. దేశీయంగాను ఈస్ట్‌‌, నార్త్‌‌ ఈస్ట్‌‌ ప్రాంతాలకు సేవలను పూర్తిగా నిలిపివేసింది. గురువారం నాటికి జెట్‌ ఎయిర్వేస్‌‌ చేతిలో కేవలం 14 విమానాలు మాత్రమే మిగిలాయి. జెట్‌ ఎయిర్వేస్‌‌ కార్యకలాపాలను గమనిస్తున్నామని, అంతర్జాతీయ రూట్లలో జె ట్‌ ను అనుమతిం చొచ్చా లేదా అనే అంశంపై డీజీసీఏ నివేదిక పంపించనుందని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ రూట్లలో విమానాలు నడపాలంటే కనీసం ఆ సంస్థకు 20 విమానాలు ఉండాలి.

Latest Updates