జెట్ ఎయిర్‌‌‌‌వేస్.. ఇండస్ట్రీకి ఒక వార్నింగ్: స్పైస్‌‌జెట్ చీఫ్

jet-failure-a-wake-up-call-policymakers-to-blame-partly-spicejet-ceo-ajay-singh
  • సగం తప్పుపాలసీ మేకర్స్‌‌దే
  • అత్యధిక ఖర్చులే జెట్‌ కు శాపం
  • స్పైస్‌‌జెట్ చీఫ్ అజయ్ సింగ్

సియోల్‌‌ :  జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ మూతపడటం ఏవియేషన్ ఇండస్ట్రీకి మేలుకొలుపు కావాలని స్పైస్‌‌జెట్ చీఫ్ అజయ్‌‌ సింగ్ అన్నారు. కాస్ట్ స్ట్రక్చర్ అత్యధికంగా ఉన్నది కాబట్టి సగం తప్పు పాలకులదే అయి ఉండాలని పేర్కొన్నారు. లో–కాస్ట్ క్యారియర్ అయిన స్పైస్‌‌జెట్ మూతపడిన జెట్‌‌లో 30 విమానాలను లీజ్‌‌కు తీసుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం స్పైస్‌‌జెట్ విమానాల సంఖ్య వందకి చేరింది. జెట్ ఎయిర్‌‌‌‌వేస్ మూతపడటం నిజంగా చాలా బాధకరమని అజ య్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. దీని ఫెయిల్యూర్‌‌‌‌కు అంతర్గత కారణాలు, అత్యధిక ఖర్చులే ప్రధాన కారణమని అన్నారు. విమానయాన రంగంలో ఉన్న  తామందరికీ, విధాన రూపకర్తలకు జెట్ మూతపడటం ఒక మేలుకొలుపు కావాలని హెచ్చరించారు. జెట్ ఎయిర్‌‌‌‌వేస్ ఒక ఐకానిక్ బ్రాండ్‌‌ అని, దీనిలో సగం తప్పు విధాన రూపకర్తలదే అయి ఉండాలని అన్నారు. జెట్ కాస్ట్ స్ట్రక్చర్ అసలు పోటీపడని విధంగా ఉంటుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

జెట్ ఎయిర్‌‌‌‌వేస్ సుమారు 26 ఏళ్ల పాటు ఇండియన్ విమానయాన రంగంలో ఓ వెలుగు వెలిగింది. దేశీయ, విదేశీ విమానాల్లో విస్తృతమైన నెట్‌‌వర్క్‌‌ను కలిగి ఉండేది. ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా అత్యధిక వృద్ధిని సాధిస్తోంది. కానీ వృద్ధితో పాటు దానికి ఖర్చుల విషయంలో కూడా అంతే ఆందోళనలున్నాయి. ముఖ్యంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) మొత్తం ఎయిర్‌‌‌‌లైన్స్ నిర్వహణ ఖర్చుల్లో 40 శాతానికి పైగా ఉంది. ఏటీఎఫ్‌‌పై అత్యధిక పన్నులు, పలు ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ ఛార్జీలు, ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌ పార్ట్‌‌లపై దిగుమతి సుంకాలు, సర్వీసులు వంటివి దేశీయ ఏవియేషన్ సెక్టార్‌‌‌‌ను ‘అన్‌‌కాంపిటీటివ్’గా  మార్చాయని సింగ్ చెప్పారు. గ్లోబల్ క్యారియర్స్‌‌తో పోటీ పడాలంటే, వారితో పోటీ పడే విధంగా ఉండే కాస్ట్ స్ట్రక్చర్‌‌‌‌ను గుర్తించాల్సినవసరం ఉందన్నారు. ఎయిర్‌‌‌‌పోర్ట్స్‌‌  బిడ్డింగ్​ను పున:సమీక్షించాల్సినవసరం ఉందని తెలిపారు. ఒకవేళ గ్లోబల్‌‌ హబ్‌‌గా అవతరించాలనుకుంటే, ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లలో ఛార్జీలు, ఇతర గ్లోబల్‌‌ హబ్స్‌‌కు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఒకవేళ వారితో పోటీ వద్దనుకుంటే, గ్లోబల్ హబ్ ఆశలను కూడా వదులుకోవాలని సూచించారు. జెట్ ఎయిర్‌‌‌‌వేస్ సంక్షోభం తర్వాత మొత్తం ఏవియేషన్ ఇండస్ట్రీ సెంటిమెంట్‌‌ గురించి ఒక్క మాటలో చెప్పిన సింగ్.. ఒక ఎయిర్‌‌‌‌లైన్ ఆపరేషన్స్‌‌ మూతపడటం ఇతర క్యారియర్స్‌‌కు సాయ పడుతుందన్నారు. కానీ ఇవన్నీ స్వల్పకాలికమేనని, దీర్ఘకాలికంగా మొత్తం ఏవియేషన్ ఇండస్ట్రీని ఆరోగ్యకరంగా ఉంచేందుకు కృషిచేయాలన్నారు. దీనికోసం తాము అంతర్గత సమస్యలను  పరిష్కరించుకోవాల్సినవసరం ఉందని సింగ్‌‌ చెప్పారు.

గుత్తాధిపత్యంవద్దు…

గ్లోబల్ ఎయిర్‌‌‌‌లైన్స్ బాడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌ ట్రాన్స్‌‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) వార్షిక సమావేశంలో సింగ్ పాల్గొన్నారు.  ఐఏటీఏ సభ్యత్వం దక్కించుకున్న తొలి లో–కాస్ట్ క్యారియర్ కూడా స్పైస్‌‌జెటే. ఏవియేషన్ రంగం ఎకానమీకి, టూరిజానికి భారీ వృద్ధిని అందించే రంగంగా ఉందన్నారు. స్పైస్‌‌జెట్ ప్రస్తుతం జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌కు చెందిన 2 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తోంది. ఈ ఉద్యోగుల్లో పైలెట్లు, క్యాబిన్ క్రూ ఉన్నారు. వెయ్యికి పైగా ఉద్యోగులను ఇప్పటికే స్పైస్‌‌జెట్ తీసుకుంది. మార్కెట్‌‌ షేరులో ఆధిపత్య స్థానంలో ఉన్న ఇండిగో గురించి సింగ్‌‌ను అడగగా.. వ్యాపారాలకు గుత్తాధిపత్యం సరియైనది కాదన్నారు.  ఇండిగో రోజూ 1300కు పైగా విమానాలను నడుపుతోంది. ఏప్రిల్ నాటికి ఇండిగో మార్కెట్ షేరు దేశీయంగా సుమారు 50 శాతం ఉంది. ఇదే సమయంలో స్పైస్‌‌జెట్ మార్కెట్ షేరు 13.1 శాతం ఉన్నట్టు ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ డేటాలో వెల్లడైంది.

 

Latest Updates