మచిలీపట్నంలో ఫైనాన్స్ ఉద్యోగిపై కత్తితో దాడి

కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ జ్యూయలరీ షాప్‌ యజమాని వరుణ్ మారుతీ ఉద్యోగి రాజేష్‌ పై శనివారం కత్తితో దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ ఉద్యోగిని కత్తితో పొడిచి కాలువలో పడేశాడు. రాజేష్‌ పరిస్థితి విషయంగా ఉండటంతో స్థానికులు హాస్పిట‌ల్ కి తరలించారు. వివ‌రాలు.. కారు ఫైనాన్స్‌ వసూలు చేయడానికి వెళ్లిన రాజేష్ ‌పై.. జ్యూయలరీ షాప్‌ యజమాని కత్తితో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి హత్యాయత్నం కింద జ్యూయలరీ షాప్‌ యజమాని మీద కేసు నమోదు చేశారు. పారారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.

Latest Updates