గాంధీ ఆసుప‌త్రిలో కరోనా పేషెంట్ బంగారం మాయం

కరోనాతో చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్న ఓ మహిళ ఒంటిపై బంగారు నగలు మాయ‌మ‌య్యాయి. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలో ఈ ఘటన జ‌రిగింది. పేషెంట్ మరణించాక బంగారు ఆభరణాలు కనిపించక‌పోవ‌డంతో ఈ గమనించిన బాధిత కుటుంబం చిలకల గూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరోనా చికిత్స కోసం కొద్ది రోజుల క్రితం గాంధీ ఆసుప‌త్రిలో చేరిన మ‌హిళ‌.. సోమ‌వారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే మృతదేహంపై నుండి బంగారు ఆభరణాలు మాయ‌మ‌య్యాయి. ఇప్పటి వరకు ఆరుగురు బాధితులు ఆసుప‌త్రిలో బంగారు న‌గ‌లు పోయిన‌ట్టుగా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసులో ప‌లువురిని అదుపులోకి తీసుకొని విచార‌ణ జ‌రుపుతున్నారు.

Latest Updates