ఝాన్సీ ఆత్మహత్య కేసు: నిందితుడి రిమాండ్

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో ప్రియుడు సూర్య తేజ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు పంజాగుట్ట పోలీసులు. నిందితుడు సూర్య కు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు..దీంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. నిందితున్ని వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించాలని కస్టడీ పిటీషన్ దాఖలు చేశారు పంజాగుట్ట పోలీసులు.

ఝాన్సీ ఆత్మహత్యకు సూర్య ప్రధానకారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. నమ్మించి మోసం చేయడం వల్లనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని అన్నారు. దీంతో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.

 

Latest Updates