నవంబర్ 30 నుంచి ఐదు దశల్లో జార్ఖండ్ ఎన్నికలు

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు  ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని  చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు.. డిసెంబర్ 23 న ఫలితాలు రానున్నాయి. మొదటి దశలో నవంబర్ 30న 13 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశ డిసెంబర్ 7న 20 స్థానాలకు, మూడోదశ 12న 17 అసెంబ్లీ స్థానాలకు, నాల్గోదశ 16న 15 స్థానాలకు చివరి దశ డిసెంబర్ 20న 16 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Latest Updates