క్రికెట్‌లో 85 ఏళ్ల చరిత్రను తిరగరాసిన జార్ఖండ్‌

జార్ఖండ్‌ కొత్త చరిత్ర

అగర్తలా: రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌ జట్టు 85 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఫస్ట్‌‌ క్లాస్‌‌ క్రికెట్‌‌లో ఫాలోఆన్‌ ఆడి మ్యాచ్‌ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. గ్రూప్‌ –సీలో గురువారం ముగిసిన మ్యాచ్‌‌లో జార్ఖండ్‌ 54 రన్స్‌ తేడాతో త్రిపురపై గెలిచింది. 153 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన జార్ఖండ్‌ 418/8 స్కోరుకు డిక్లేర్‌ చేసింది. సౌరభ్‌ తివారీ (122 నాటౌట్‌ ), ఇషాంక్‌ జగ్గీ (107 నాటౌట్‌ ) సెంచరీలతో దుమ్మురేపారు. నజీమ్‌ (40), రాహుల్‌ ప్రసాద్‌ (32) రాణించారు. ఫలితంగా త్రిపుర ముందు 256 టార్గెట్‌‌ను నిర్దేశించారు. దీన్ని ఛేజ్‌ చేసేందుకు బరిలోకి దిగిన త్రిపుర రెండో ఇన్నింగ్స్‌ లో 211 పరుగులకే ఆలౌటైంది. మురా సింగ్‌ (103) సెంచరీతో రాణించినా ప్రయోజనం లేకపోయింది. ఆశిష్‌ కుమార్‌ (5/67) దెబ్బకు త్రిపుర ఓ దశలో 49 రన్స్‌ కే 6 వికెట్లు
చేజార్చుకుంది. అంతకుముందు జార్ఖండ్​ ఫస్ట్​ ఇన్నింగ్స్​ లో 136కు ఆలౌటైంది. ఓవరాల్‌‌గా ఈడెన్‌‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఫాలో ఆన్‌‌లో గెలిచిన తర్వాత మళ్లీ అలాంటి ఫీట్‌‌ను సాధించిన తొలి టీమ్‌‌గా జార్ఖండ్ నిలిచింది.

Latest Updates