10, 12 తరగతుల టాపర్లకు జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి కార్లు గిఫ్ట్

పరీక్షల్లో ర్యాంక్ లు సాధించిన టాపర్లకు జార్ఖండ్ ప్రభుత్వం గిఫ్టులను ఇచ్చింది. 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో కార్లను బహుమతిగా ఇచ్చారు. జార్ఖండ్ అకాడెమిక్ కౌన్సిల్ నిర్వహించిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి బుధవారం(సెప్టెంబర్-23) కార్లను బహుమతిగా అందించారు.

అంతకుముందే పదో తరగతి ఫలితాలు విడుదలైతే రాష్ట్ర టాపర్లకు కార్లను బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశ్యాన్ని మంత్రి ప్రకటించారు. ప్రకటించినట్టుగానే మాట నిలబెట్టుకున్నారు. ర్యాంక్ సాధించిన విద్యార్థుల్లో అమిత్ కుమార్ 91.4 శాతంతో 12 వ తరగతిలో మొదటి స్థానంలో నిలవగా, మనీష్ కుమార్ కటియార్ 98 శాతంతో 10వ తరగతిలో మొదటి ర్యాంక్ సాధించాడు.

Latest Updates