రూ.51 వేల పార్టీ ఫండ్‌‌‌‌‌‌‌‌ ఇస్తేనే ఎమ్మెల్యే టికెట్‌‌‌‌‌‌‌‌

  • ప్రకటించిన జేఎమ్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌ పార్టీ

రాంచీ: జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ ముక్తి మోర్చా (జేఎమ్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌) పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయాలనుకునే కేండిడెట్లు  రూ.51వేలు ఇవ్వాలని ఆ పార్టీ చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ ఫండ్‌‌‌‌‌‌‌‌ కింద దాన్ని ఉపయోగిస్తామని ప్రకటించింది. గత ఎన్నికల్లో కూడా ఇలానే ఫండ్స్‌ వసూలు చేశామని అప్పుడు రూ.5వేల నుంచి 21వేల వరకు తీసుకున్నామని జేఎమ్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ, అధికార ప్రతినిధి వినోద్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండే చెప్పారు. “ మనది కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ పార్టీ కాదు. పార్టీ ఫండ్‌‌‌‌‌‌‌‌ ద్వారా నడుస్తోంది. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కేండిడెట్‌‌‌‌‌‌‌‌ రూ.51వేలు పార్టీ ఫండ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి” అని పాండే చెప్పారు. 81 అసెంబ్లీ సీట్లున్న జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీకి నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30 నుంచి ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

 

Latest Updates