చేతబడి చేస్తున్నాడని.. చంపి అంగన్ వాడి కేంద్రంలో పాతిపెట్టారు

చేతబడి, మాయ మంత్రాలు చేస్తున్నాడన్న కారణంతో జార్ఖండ్ లో ఓ వ్యక్తిని అమానుషంగా  కొట్టి చంపారు. రాష్ట్రంలోని లోహర్ దగా జిల్లా జాల్జామేద్రా గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన సనాయ్ ఓరన్(52) అనే వ్యక్తి మంత్రాలు చేస్తూ గ్రామస్తులను చంపుతున్నాడన్న కారణంతో కొందరు వ్యక్తులు  అతనిపై దాడి చేసి చంపారు.

ఇటీవల గ్రామానికి చెందిన బిర్సా ఓరన్ అనే వ్యక్తి మరణానికి సనాయ్ కారణమని గ్రామస్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. బిర్సా మరణించిన తర్వాత.. అతని అంత్యక్రియలకు గ్రామస్తులంతా హాజరైనా.. సనాయ్ హాజరుకాకపోవడంతో.. సనాయ్ యే ఈ పని చేశాడని  అతనిపై  అనుమానపడ్డారు. బిర్సా చావుకి సనాయ్ యే కారణమని ఆగ్రహావేశాలతో  దాడికి పాల్పడ్డారు. వారు దెబ్బలకు తాళలేని సనాయ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇదే అదననుకొన్న ఆ గ్రామస్తులు అత్యంత పాశవికంగా  ఓ బండరాయితో అతని తలపై మోది చంపారు. ఆ తర్వాత అతని శవాన్ని గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో పాతిపెట్టారు. సనాయ్ కొడుకు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతని డెడ్ బాడీని స్వాధీనం చేసుకొని, ఈ ఘటనపై విచారణ మొదలెట్టారు.

Jharkhand villagers smash man's head with boulder, accuse him of black magic

Latest Updates