రిలయన్స్ సంచలన ఆఫర్ : 4K LEDటీవీ, సెట్‌టాప్‌ బాక్స్‌ ఫ్రీ

jio-fiber-services-from-september-5

టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్ మరోసారి సంచలనం సృష్టించే న్యూస్ చెప్పింది. జియో గిగా ఫైబర్‌ సేవలకు సంబంధించి అందరూ ఊహించిన దానికంటే  ఎక్కువగా ఆఫర్లను ప్రకటించింది. టెలికాం రంగంలో జియో లాగే అతి తక్కువ ధరకే ఫైబర్‌ సేవలను భారతీయ వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబాని. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్‌ అంబానీ ఈ విషయాన్ని తెలిపారు. రానున్న 18 నెలలో అప్పుల్లేని కంపెనీగా రిలయన్స్‌ అవతరించనుందని ముకేశ్‌ ప్రకటించడం విశేషం. జియో 3వ  వార్షికోత్సవం సందర్భంగా  ఈ ఏడాది  సెప్టెంబర్‌ 5 నుంచి  దేశవ్యాప్తంగా జియో ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తెస్తామని అంబానీ తెలిపారు.

100MBPS నుంచి 1GBPS వరకు స్పీడ్. ప్రీ వెల్‌ కం ప్లాన్‌ కింద కస్టమర్లకు 4K LEDTV / HDtv, 4k సెట్‌ టాప్‌ బాక్స్‌ పూర్తిగా ఉచితంగా అందిస్తామన్నారు. దీంతో 5 లక్షల కుటుంబాలకు ఫ్రీ ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.  జియో ఫైబర్ సబ్‌ స్క్రైబర్స్‌ కు ల్యాండ్‌ లైన్‌ ద్వారా ఇంటి నుంచి అన్‌ లిమిటెడ్‌ వాయిస్ కాల్స్  అందించనుంది.

రూ.500 లకే అమెరికా, కెనడాకు అన్‌ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే  ప్రీమియం కస్టమర్లు ఇంటివద్దే ఫస్ట్ డే ఫస్ట్ షో  ప్రాతిపదికన కొత్త సినిమాలు  చూసే అవకాశం కల్పిస్తామన్నారు. దీనికి సంబంధించి  పూర్తి వివరాలు జియో.కాం ద్వారా సెప్టెంబరు 5నుంచి అదుబాటులో వుంటాయని తెలిపారు. అలాగే  రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరిస్తుందన్న అంబానీ, బ్రాడ్‌ బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌ టాప్ బాక్స్‌ ను సిద్ధం చేశామన్నారు. జియో ఫైబర్‌ నెట్‌ ద్వారా MSME క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తామని తెలిపారు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ.

జియో ఫైబర్‌ విశేషాలు..

జియో ఫైబర్‌ ద్వారా 100MBPS నుంచి 1 GBPS వరకు స్పీడ్

ప్రజలందరికీ అందుబాటు ధరల్లో జియో సేవలు. జియో ఫైబర్‌ సేవలు నెలకు రూ. 700 నుంచి రూ. 10వేల వరకు ఉంటాయి 

ప్రీమియం జియో ఫైబర్‌ కస్టమర్లు సినిమా విడుదలైన రోజే తమ ఇంట్లో చూసుకోవచ్చు. ‘జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’గా పిలిచే ఈ సేవలను 2020 మధ్యలో అందుబాటులోకి తీసుకొస్తాం

జియో ఫైబర్‌ ద్వారా భారత్‌లోని ఏ టెలికాం ఆపరేటర్‌ కైనా ఇంటి నుంచే ఫ్రీగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ సేవలు లైఫ్ టైమ్ ఉంటాయి

ప్రారంభ ఆఫర్‌ కింద ఫరెవర్ వార్షిక ప్లాన్‌ తీసుకునే జియో ఫైబర్‌ కస్టమర్లు HD/ 4K LEDTV, సెట్‌ టాప్‌ బాక్సును ప్రీగా తీసుకోవచ్చు

జియో నుంచి నెలకు రూ. 500తో అమెరికా, కెనడాకు అన్ లిమిటెడ్ కాలింగ్‌ ప్యాకేజీ

Latest Updates