జియో సంచ‌ల‌నం..4జీ, 5జీ నెట్ వ‌ర్క్ ల‌తో 10కోట్ల ఫోన్ల త‌యారీ

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ టెలికాం సంస్థ మ‌రో సంచ‌ల‌నానికి తెర‌తీసింది. ఇప్పటికే ఎక్కువ కనెక్షన్లతో దూసుకుపోతున్న జియో..తాజాగా దేశీయ స్మార్ట్‌ఫోన్ విభాగంలో అగ్రస్థానంలో నిలవాలని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా తక్కువ ధరకే‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లను తయారు చేయడానికి సన్నద్ధమైనది. దాదాపు 10 కోట్ల స్మార్ట్‌ఫోన్లను తయారు చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ బిజినెస్ స్టాండ‌ర్డ్ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది.

డేటా ప్యాక్‌లతో కూడిన ఫోన్‌లను 2020 డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయాల‌ని రియ‌లన్స్ సిద్ధంగా ఉన్న‌ట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

రిలయన్స్ నుంచి రాబోయే స్మార్ట్‌ ఫోన్లు 4జీ, 5జీ నెట్ వర్క్ లతో పనిచేయనున్నాయి. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ను డిజైన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ప్రతి భారతీయుడికి స్మార్ట్‌ఫోన్‌ను అందజేయాలన్న రిలయన్స్ కృషి చేస్తుంది. అందుకే భారీ ఎత్తున జియో స్మార్ట్ ఫోన్ల‌ను త‌యారు చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

కాగా జియో మార్కెట్ దృష్ట్యా ఇప్ప‌టికే రిలయన్స్ తన డిజిటల్ ఆర్మ్ జియో ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 33 శాతం విక్రయించి రూ. 152,000 కోట్లకు ఫేస్ బుక్, ఇంటెల్ మరియు క్వాల్క‌మ్ తో పాటు ఇత‌ర టెక్ కంపెనీలు సొంతం చేసుకున్నాయి.

Latest Updates