వాట్సప్ మెసేజ్‌లో జియో టీవీ

రిలయన్స్ జియో మరో ముందడుగు వేసింది. కొత్త కొత్త ఫీచర్లతో ఇప్పటికే మార్కెట్లో దూసుకుపోతున్న ఈ దిగ్గజం జియో టీవీ యాప్ ద్వారా యూజర్లకు సరికొత్త ఫీచర్ ను అందిస్తోంది. ఈ ఫీచర్ ప్రకారం ఇకపై యూజర్లు వాట్సప్ మెసేజ్ ద్వారా నేరుగా ఛానల్ ప్రసారాలు చూడవచ్చు. ఇప్పటికే యూట్యూబ్ ఈ రకమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. తాజాగా యూట్యూబ్ బాటలో జియో టీవీ కూడా నడిచేందుకు రెడీ అయింది. పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ ద్వారా యూజర్లు ఇకపై వాట్సప్ నుంచే నేరుగా ప్రసారాలు చూడవచ్చు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం జియో టీవీ యాప్ Picture-in-Picture (PiP) modeని ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా జియో టీవీ నుంచి ఏదైనా కార్యక్రమాన్ని జియో సబ్ స్క్రైబర్లు వాట్సప్ కు మెసేజ్ చేస్తే వారు దాన్ని ధర్డ్ పార్టీ యాప్ లోకి వెళ్లకుండా చూడొచ్చు. నేరుగా జియో టీవీ యాప్ లోకి వెళ్లకుండా వాట్సప్ నుంచే చూడవచ్చు.ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో లేదు. Android 8.0 పైన వర్షన్ ఉన్నవారు ఈ అప్ డేట్ ని ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఓరియో ఆపైన ఆపరేటింగ్ సిస్టం ఉన్న వారికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

జియో టీవీ లైవ్ టీవీ యాప్. రియల్ టైమ్‌లో 600కుపైగా టీవీ చానళ్లను చూడొచ్చు. రికార్డింగ్ సపోర్ట్, పుష్ సపోర్ట్, 7 డే క్యాచప్ టీవీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలోనే పనిచేస్తుంది.

Latest Updates