జియో విలువ 3.5 లక్షల కోట్లు

టెలికాం మార్కెట్‌ లో సంచలనాలకు తెరతీసిన రిలయన్స్ జియో కేవలం మూడేళ్లలోనే మూడున్నర లక్షల కోట్లకు ఎదిగింది. జియో కంపెనీ విలువను 50 బిలియన్ డాలర్లుగా(రూ.3,49,120 కోట్లకు పైగా) జేపీ మోర్గాన్ లెక్కకట్టింది.వాల్యుయేషన్ పరంగా ఈ మేర దూసుకెళ్తోన్న జియోలో పెట్టు బడులు పెట్టేందుకు జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ ఆసక్తి చూపుతోంది.

జియో కంపెనీలో 2 బిలియన్ డాలర్లనుంచి 3 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాలని సాఫ్ట్​బ్యాంక్ చూస్తున్నట్టు తెలిసింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ పెట్టుబడులురూ.13,973 కోట్ల నుంచి రూ.20,959 కోట్లకుపైగా ఉండనున్నాయి. బిలీనియర్ ముఖేష్ అంబానీ ఇటీవల పలు కంపెనీలలో వాటాలు అమ్ముతున్ననేపథ్యంలో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ అంబానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం కోసం చూస్తోంది. ఇప్పటికే చాలాకంపెనీల్లో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ పెట్టు బడులు పెట్టింది. అయితే ఎంత నగదును సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ పెట్టనుంది? ఒకవేళ ముఖేష్ ఏర్పాటు చేయబోయే ఈకామర్స్ వెంచర్‌ ను జియో సంస్థ లో కలిపితే ఈక్వి టీ వాల్యుషన్ ఎంత? అనే విషయాలపై మాత్రం స్పష్టం గా తెలియరాలేదు. పలు ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్‌ , జియోలో పెట్టు బడులు పెట్టబోతోందనే విషయాన్ని జేపీమోర్గాన్ తన అధ్యయన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెల్లడించింది. 2016 సెప్టెంబర్‌ లో జియో 4జీ ఆధారిత టెలికాం సర్వీసులను లాంచ్ చేసింది. రెండేళ్ల కాలంలోనే ఇది దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది. ఈ విషయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారప్రతినిధిని సంప్రదించగా… ‘మా పాలసీ ప్రకారం మీడియా ఊహాగానాలు, రూమర్లపై కామెంట్ చేయకూడదు’ అని తెలిపారు. ప్రస్తుతం తమకంపెనీలుపలు అవకాశాలను పరిశీలిస్తోందనిచెప్పారు. అటు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ కూడా ఈ విషయంపై స్పందించలేదు. సింగిల్ ఇన్వెస్టర్ లేదా సంయుక్త ఇన్వెస్టర్ల నుంచి 5 బిలియన్ డాలర్లకు పైగా ఈక్వి టీఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో ఉండాలని ఆశిస్తున్నట్టు జేపీ మోర్గాన్ తెలిపింది. జియో కంపెనీ విలువను 50 బిలియన్ డాలర్లుగా జేపీ మోర్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెక్కకట్టింది.

కాంబో ప్యా క్లో జియో గిగాఫైబర్
మరో వైపు జియో తన గిగా ఫైబర్ బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీసులను కాంబో ప్యాక్‌లో తీసుకురావాలనిచూస్తోంది. అంటే బ్రాడ్‌ బ్యాండ్‌ , టీవీ, ల్యాండ్‌ లైన్సర్వీసులను కేవలం నెలకు రూ.600కే లాంచ్ చేయాలని చూస్తోంది. ఆప్టికల్ నెట్‌ వర్క్ టర్మినల్ రౌటర్ ద్వారా ఈ కాంబో సర్వీసులను జియో అందించనుంది. ఈ రౌటర్ ద్వారా 40 నుంచి45 డివైజ్‌ లను కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా జియో గిగాఫైబర్ ద్వారా స్మార్ట్ హోమ్ నెట్‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారడానికి రూ.వెయ్యి వరకు చెల్లించి అదనంగా మరో 40 డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జియోగిగా ఫైబర్ సర్వీసులు ఢిల్లీ, ముంబైప్రాంతాల్లో టెస్టింగ్ దశలో ఉన్నాయి. సెకనుకు100 మెగాబైట్ స్పీడులో 100జీబీ డేటాను సబ్‌ స్క్రైబర్లకు ఆఫర్ చేయనుంది. ఈ రౌటర్‌ సర్వీసుకోసం సబ్‌ స్క్రయిబర్ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ పేమెంట్ కిందరూ.4,500ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంరి ఫండబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని కంపెనీ చెబుతోంది. టెలిఫోన్,టెలివిజన్ సర్వీసులను వచ్చే మూడు నెలల్లో యాడ్చేయనుంది. ఈ మూడు సర్వీసులు ఏడాది పాటుపూర్తిగా ఉచితం.

Latest Updates