జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ల కొత్త ప్లాన్స్ ఇవే..

రిలయన్స జియో.. తన కస్టమర్లకు ఓ సరికొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. పెంచిన టారిఫ్ రేట్లపై తన కస్టమర్లకు  ఊరట కలిగించేలా ఆల్‌ ఇన్ వన్ అనే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.199 నుంచి రూ.2,199 వరకూ ఉండే ఈ న్యూ ప్రీపెయిడ్ ప్లాన్ శుక్రవారం(డిసెంబర్ 6) నుంచి అమల్లోకి రానుంది. గత నెల నవంబర్ 30న  ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తమ కస్టమర్ల కోసం కొత్త ప్లాన్ లను  ప్రకటించాయి. అదే దారిలో జియో కూడా గురువారం ఈ ప్లాన్ ను ప్రకటించింది.

28 రోజుల వ్యాలిడిటీలో 1.5 జీబీ డాటాను అందిస్తుంది. జియో తో పాటుగా మిగిలిన కంపెనీలు కూడా అదే డాటాను అందిస్తున్నాయి. కంపెనీల వారీగా ఆ ప్లాన్ లను ఓ సారి గమనిస్తే..

రిలయన్స్ జియో (రూ. 199)

రిలయన్స్ జియో నుండి వచ్చిన ఈ కొత్త ప్లాన్ తో రోజుకు 1.5GB  డేటాని  పొందొచ్చు. అంతేకాకుండా జియో నుంచి మిగతా నెటవర్క్ లకు 1000 నిమిషాలు మరియు జియో టు జియో అన్ లిమిటెడ్ కాల్స్ ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. రోజుకు 100 SMS లు ఉచితం. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు

ఎయిర్‌టెల్ (రూ .248)

మరొక టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ కూడా రోజుకు 1.5GB డాటా ని  రూ.248 ప్లాన్ తో అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీతో.. అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే సదుపాయం కలిగిస్తోంది. రోజుకు 100 SMS లు ఉచితం.

వొడాఫోన్ (రూ .249)

రూ .249 ప్రీపెయిడ్ ప్లాన్ తో వోడాఫోన్ కూడా రోజుకు 1.5GB డేటాని అందిస్తుంది. వోడాఫోన్ టు వోడాఫోన్ అన్ లిమిటెడ్ కాల్స్, మరియు  ఇతర నెట్ వర్క్ లకు 1000 మినిట్స్  వాయిస్ కాల్స్ ను అందిస్తుంది. వీటితో పాటుగా రోజుకు 100 SMS లు ఉచితం.

ప్లాన్ ల వారీగా ఒకసారి చూస్తే..

రిలయన్స్ జియో

డేటా           ప్లాన్                కాల్స్                                                వ్యాలిడిటీ

1.5 జీబీ    రూ.199      జియో టు జియో అన్ లిమిటెడ్                       28 డేస్

మిగతా నెట్ వర్క్ లకు 1000 నిమిషాలు

2 జీబీ       రూ.249     జియో టు జియో అన్ లిమిటెడ్                       28 డేస్

మిగతా నెట్ వర్క్ లకు 1000 నిమిషాలు

3 జీబీ       రూ.349       జియో టు జియో అన్ లిమిటెడ్                       28 డేస్

మిగతా నెట్ వర్క్ లకు 1000 నిమిషాలు

వోడాఫోన్ ఐడియా

డేటా           ప్లాన్                    కాల్స్                                                వ్యాలిడిటీ

1.5 జీబీ    రూ.249         వోడా టు వోడా అన్ లిమిటెడ్                          28 డేస్

మిగతా నెట్ వర్క్ లకు 1000 నిమిషాలు

2 జీబీ       రూ.299         వోడా టు వోడా అన్ లిమిటెడ్                          28 డేస్

మిగతా నెట్ వర్క్ లకు 1000 నిమిషాలు

3 జీబీ  రూ.399                 వోడా టు వోడా అన్ లిమిటెడ్                       28 డేస్

మిగతా నెట్ వర్క్ లకు 1000 నిమిషాలు

ఎయిర్ టెల్

డేటా            ప్లాన్                 కాల్స్                                     వ్యాలిడిటీ

1.5 జీబీ       రూ.248         అన్ లిమిటెడ్ కాల్స్                       28 డేస్

2 జీబీ         రూ.298         అన్ లిమిటెడ్ కాల్స్                         28 డేస్

Latest Updates