యూఎస్, కెనడాల్లో జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలు బంద్

న్యూయార్క్: జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలను యూఎస్, కెనడాలలో నిలిపివేస్తున్నట్లు హెల్త్‌కేర్ దిగ్గజం జాన్సన్ & జాన్సన్ కంపెనీ ప్రకటించింది. ఈ బేబీ పౌడర్ వాడకం ద్వారా కేన్సర్ వచ్చే అవకాశముందంటూ ఆమెరికా, కెనడా దేశాల్లో ఆరోపణలు రావడంతో అక్కడ అమ్మకాలకు డిమాండ్ బాగా తగ్గిపోయింది. యూఎస్ లోనే దాదాపు 20 వేల మంది వరకు కంపెనీపై దావా వేశారు. పౌడర్ అమ్మకాలపై బ్యాన్ విధించాలంటూ కొన్ని వేల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బేబీ పౌడర్ అమ్మకాలను ఆ రెండు దేశాల్లో నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే నిల్వ ఉన్న స్టాక్స్ పూర్తిగా ఖాళీ అయ్యేవరకు అమ్మకాలు కొనసాగిస్తామని తెలిపింది. యూకేతో పాటు, ప్రంపంచంలోని మిగతా దేశాలలో జాన్సన్ బేబీ పౌడర్‌ అమ్మకాలు కొనసాగిస్తామని గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Latest Updates