టెర్రరిస్టుల చొరబాటు యత్నం.. తిప్పికొట్టిన ఆర్మీ

శ్రీనగర్: లైన్ ఆఫ్ కంట్రోల్ ద్వారా ఇండియాలోకి ప్రవేశించాలనుకున్న టెర్రరిస్టు గ్రూప్ యత్నాలను ఆర్మీ విఫలం చేసింది. ఈ నెల 3వ తేదీన ఇండియా భూభాగంలోకి చొరబడటానికి టెర్రరిస్టుల గ్రూప్ ట్రై చేస్తున్న సమయంలో ఆర్మీ పెట్రోలింగ్ పార్టీ వారిని గుర్తించింది. దీంతో ఈ చొరబాటు ఫెయిల్ అయింది. నార్త్ కాశ్మీర్‌‌, నౌగామ్ సెక్టార్‌‌లోని ఎల్‌వోసీ వద్ద ఈ గ్రూప్‌ను ఆర్మీ గుర్తించింది. చీకటి పడటంతోపాటు ప్రతికూల వాతావరణం నెలకొనడంతో ఆ టెర్రరిస్టులు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అయితే హడావుడిలో తాము వాడిన కొన్ని బట్టలు, బ్యాటరీలతోపాటు ఎల్‌వోసీ గుండా ఉన్న ఫెన్స్‌ను దాటడానికి వాడిన ఇతర ఎక్విప్‌మెంట్స్‌ను వదిలేసి వెళ్లారు.

Latest Updates