జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అక్కితం అచ్చుతన్ నంబూత్రి  మృతి

మలయాళ మహాకవి,జ్ఞనాపీఠ్ అవార్డు గ్రహీత అక్కితం అచ్చుతన్ నంబూత్రి ఇవాళ ( గురువారం)  కన్నుమూశారు. త్రిసూరులోని ఓ పైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 94 ఏళ్లు. గతేడాది జ్ఞాన్‌పీఠ్‌ అవార్డును అక్కితంకు కేంద్రం ప్రకటించగా …గత సెప్టెంబర్‌ 24వ తేదీన కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ అవార్డును అందజేశారు. కేరళ సాహిత్యంలో తన రచనలతో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చిన కవి అక్కితం. అత్యున్నత సాహితీ అవార్డు జ్ఞానపీఠ్‌ను గెలుచుకున్న ఆరో మళయాళ కవి అక్కితం అచ్చుతన్ నంబూత్రి.

Latest Updates