డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన‌ జేఎన్టీయూ

హైద‌రాబాద్: క‌రోనా దృష్ట్యా ఇప్ప‌టికే ప‌లు ప‌రీక్ష‌లు వాయిదాప‌డ్డ విష‌యం తెలిసిందే. తాజాగా జేఎన్టీయూ ప‌రిధిలోని డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌లు కూడా వాయిదా ప‌డ్డాయి. జూన్- 20 నుండి జరగాల్సిన‌ యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేసినట్లు శుక్ర‌వారం ప్ర‌క‌టించింది జేఎన్టీయూ. ప్రభుత్వ ఆర్డర్ లేకుండా ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది జేఎన్టీయూ. స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల తరువాతే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు యూనివ‌ర్సిటీ అధికారులు. ఇందుకు సంబంధించిన కొత్త తేదీ వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు.

Latest Updates