టెక్నికల్​ స్టూడెంట్స్​కు.. జాబ్​ గ్యారంటీ కోర్సులు

మాన్యుఫాక్చరింగ్​ ఇండస్ట్రీలో టూల్ డిజైనర్ల కొరతను తీరుస్తూ.. టెక్నికల్​ స్టూడెంట్స్​కు జాబ్​ గ్యారంటీ ట్రైనింగ్​ అందిస్తోంది బాలానగర్​లోని సెంట్రల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టూల్​ డిజైన్. ఇక్కడ స్కిల్స్​ నేర్చుకున్న వందల మంది టాప్​ కంపెనీల్లో జాబ్స్​ కొట్టడంతోపాటు సొంతంగా ఇండస్ట్రీస్​ పెడుతున్నారు. ప్రస్తుతం ఎంఈ, ఎంటెక్​, పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్​ కొనసాగుతున్నాయి.

ఎంఎస్​ఎంఈ సంపర్క్

సీఐటీడీలో ట్రైనింగ్​ పొందిన జాబ్​ సీకర్​ను.. ట్రైనింగ్​ స్టాఫ్​ అవసరం ఉన్న ఇండస్ట్రీ రిక్రూటర్​ను ఒకే వేదికపైకి తెచ్చే పోర్టలే ఎంఎస్​ఎంఈ సంపర్క్​. సీఐటీడీలో అన్ని విభాగాల్లో కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు సంపర్క్​ పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ చేసుకుంటారు. టూల్ డిజైనర్లు, ఇతర స్టాఫ్​ అవసరం ఉన్న ఇండస్ర్టీలు సంపర్క్​ పోర్టల్​ ద్వారా రిక్రూట్​ చేసుకుంటాయి.

ఎస్సీ, ఎస్టీలకు ఉచితం

ఏడాదిలోపు వ్యవధితో ఉండే షార్ట్​టెర్మ్​/సర్టిఫికెట్, పీజీ డిప్లొమా​ కోర్సులతోనే అధికమంది ఉపాధి పొందుతున్నారు. ఇవి ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్​కు ఉచితం. రిజిస్ర్టేషన్ ఫీజు కోర్సును బట్టి చెల్లించాల్సి ఉంటుంది. ఇతర కేటగిరీల వారికి కోర్సు ఫీజు ఉంటుంది. ఈ విభాగంలో క్యాడ్/క్యామ్, వీఎల్ఎస్ఐ, ఆటోమేషన్ లో దాదాపు 35 సర్టిఫికెట్ ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి.

ఆన్​లైన్​ కోర్సులు

ఇండస్ట్రియల్​ ఆటోమేషన్​లో వర్కింగ్​ ప్రొఫెషనల్స్​తోపాటు నిరుద్యోగ యువతకు సీఐటీడీ ఆన్​లైన్​ కోర్సులు ఆఫర్​ చేస్తోంది. నెల రోజుల వ్యవధి గల ఈ కోర్సుల ఫీజు రూ.8350. ఎస్సీ ఎస్టీలకు ఉచితం. రిజిస్ట్రేషన్​ ఫీజు మాత్రం రూ.590 చెల్లించాలి.

కోర్సులు: ఏఎస్​ఐసీ ప్రోగ్రామర్​, లే అవుట్​ ఇంజినీర్​, ఐసీ ఫిసికల్​డిజైన్​ ఇంజినీర్​, వీఎల్​ఎస్​ఐ, మాట్​ల్యాబ్​, ఎంబేడెడ్​ సిస్టమ్స్​, మైక్రోకంట్రోలర్​ ప్రోగ్రామింగ్​, మెషిన్​ లెర్నింగ్, రోబోటిక్స్​ ప్రోగ్రామర్​,  పీఎల్​సీ ప్రోగ్రామర్​,  ఆటోమేషన్​ ఇంజినీర్​.

అర్హత: డిప్లొమా/ ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రానిక్స్​/ కంప్యూటర్​/ బయోమెడికల్​/ఐటీ/ ఇన్​స్ట్రుమెంటేషన్​లో డిగ్రీ, ఐటీ/ ఎలక్ట్రానిక్స్​/ ఫిజిక్స్​లో బీఎస్సీ/ ఎంఎస్సీ

అడ్మిషన్స్​: ఫస్ట్​ కం ఫస్ట్​ సర్వ్​ బేసిస్​ మీద ప్రతి నెల మొదటి, మూడో బుధవారం అడ్మిషన్స్​ జరుగుతాయి. ఒక వేళ ఆన్​లైన్​లో కోర్సు వద్దు అనుకునే వారు నేరుగా సీఐటీడీకి వెళ్లి క్లాసెస్​ వినొచ్చు.

సామ్‌‌సంగ్​ కోర్సులు

సామ్‌‌సంగ్ టెక్నికల్ స్కూల్ పేరుతో ఐటీఐ మొదలుకొని పీజీ గ్రాడ్యుయేట్ల వరకు ప్రత్యేకంగా 5 రకాల సర్టిఫికెట్ కోర్సులను సీఐటీడీ ఆఫర్​ చేస్తోంది. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి ఫ్రీ టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మహిళలు, దివ్యాంగులు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి సామ్​సంగ్ స్కాలర్‌‌షిప్‌‌తో పాటు టాపర్స్ కు అవార్డులు అందజేస్తుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్‌‌తో పాటు సామ్‌‌సంగ్ సర్వీస్ సెంటర్లలో ఆన్ జాబ్ ట్రైనింగ్, ఆపైన ప్లేస్‌‌మెంట్స్ ఉంటాయి. ప్రతి నెలా మొదటి, మూడో బుధవారం ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. ఎవరైనా సీఐటీడీలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈవెనింగ్​ కోర్సులు

సీఐటీడీలో 25 శాతం థియరీ, 75 శాతం ప్రాక్టికల్ పై ఫోకస్ చేస్తూ సిస్టమేటిక్​ ట్రైనింగ్ ఉంటుంది. రెగ్యులర్​, సర్టిఫికెట్​ కోర్సులతోపాటు ఎంఎస్​ఎంఈ సెక్టార్​ ఇండస్ట్రీస్​లో పని చేసే ఎంప్లాయీస్ స్కిల్స్​ పెంచేందుకు సీఐటీడీ ఈవెనింగ్​ కోర్సులు రన్​ చేస్తోంది. టూల్​  ఇంజినీరింగ్​, సీఏడీ/సీఏఎం/ సివిల్​ ఇంజినీరింగ్​ & ఇండస్ట్రియల్​ ఆటోమేషన్​ విభాగాల్లో అడ్మిషన్స్​ తీసుకోవచ్చు.

–సుగ్యాన్ రంజన్ దలాయ్​, డిప్యూటీ డైరెక్టర్, సీఐటీడీ హైదరాబాద్​

For More News..

ఇండియాకు గుడ్​ చాన్స్‌.. ఐపీఎల్‌‌లో ఆడిన ప్లేయర్లు మంచి రిథమ్‌‌లో ఉన్నారు

ఇండియన్​కు ‘బుకర్​’ జస్ట్​ మిస్

ఒక్కరోజులోనే టికెట్లు ఖతం

Latest Updates