టెన్త్​, ఇంటర్​తో జాబ్​ గ్యారంటీ కోర్సులు

హైదరాబాద్​లోని అపరల్​ట్రైనింగ్​ & డిజైన్​ సెంటర్​ టెన్త్​, ఇంటర్​ పాసైన​ స్టూడెంట్స్​కు వొకేషనల్​, స్కిల్ డెవలప్​మెంట్​ కోర్సులు అందిస్తోంది. కోర్సు కంప్లీట్​ చేసిన యువతకు అపరల్​, టెక్స్​టైల్​, ఫ్యాషన్​, లైఫ్​స్టైల్​, రిటైల్​ రంగాల్లో బెస్ట్​ కెరీర్​ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. షార్ట్​ టర్మ్​ ఎంట్రీ లెవెల్​ సర్టిఫికెట్​ కోర్సుల నుంచి మూడేళ్ల బ్యాచిలర్​ డిగ్రీ వంటి కోర్సులందిస్తూ.. టాప్​ కంపెనీల్లో  ప్లేస్​మెంట్స్​ చూపుతున్న ఏటీడీసీ హైదరాబాద్​ ఇన్​స్టిట్యూట్​ ఇన్ఫో ఈ వారం.

మినిస్ట్రీ ఆఫ్​ టెక్స్​టైల్​ డిపార్ట్​మెంట్​ ఫ్యాషన్​ ఇండస్ట్రీ విభాగం కింద ఏర్పాటైన అపరల్​ ట్రైనింగ్​ & డిజైన్​ సెంటర్(ఏటీడీసీ)కి ఇండియాలో లార్జెస్ట్​ క్వాలిటీ వోకేషనల్​ ట్రైనింగ్​ ప్రొవైడర్​గా గుర్తింపు ఉంది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 100 ట్రైనింగ్​ ఇన్​స్టిట్యూట్లు, 35 ఏటీడీసీ వోకేషనల్​ సెంటర్స్​లో సర్టిఫికెట్​, షార్ట్​ టర్మ్​, లాంగ్​టర్మ్​/ బ్యాచిలర్​ డిగ్రీ ప్రోగ్రామ్స్​ నడుస్తున్నాయి. వీటిలో నామినల్​ ఫీజుతో కొన్ని, స్కాలర్​షిప్​ ఓరియెంటెడ్​, ఫ్రీగా అందించే కోర్సులు మరికొన్ని ఉన్నాయి.

బ్యాచిలర్​ డిగ్రీ కోర్సులు

అపరల్​ ట్రైనింగ్​ అండ్​ డిజైన్​ సెంటర్(ఏటీడీసీ)​ రాజీవ్​గాంధీ నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ యూత్​ డెవలప్​మెంట్​(ఆర్​జీఎన్​ఐవైడీ) కొలాబరేషన్​తో అపరల్​ అండ్​ ఫ్యాషన్​ ఇండస్ట్రీకి సంబంధించిన రెండు బ్యాచిలర్​ ఇన్​ వోకేషనల్ ఎడ్యుకేషన్​(బీవోసీ)​ కోర్సులు అందిస్తోంది.  వీటిలో ప్రధానంగా  బీవోసీ ఇన్​ అపరల్​ మాన్యుఫాక్చరింగ్​ & ఎంటర్​ప్రెన్యూర్​షిప్,  బీవోసీ ఇన్​ ఫ్యాషన్​ డిజైన్​ & రిటైల్​ మూడేళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సుకు 15 సీట్లు ఉంటాయి. ఇంటర్​ పాసైన వారు ఈ కోర్సులకు అర్హులు. స్క్రీనింగ్​ టెస్ట్​/ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్​ కల్పిస్తారు. దరఖాస్తులకు 15 ఫిబ్రవరి 2021 చివరి తేది. కోర్సుల ఫీజు  ఏడాదికి రూ.67,000.

డిప్లొమా కోర్సులు

నేషనల్​ స్కిల్స్​ క్వాలిఫికేషన్స్​ ఫ్రేమ్​వర్క్​(ఎన్​ఎస్​క్యూఎఫ్​), నేషనల్​ స్కిల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​(ఎన్​ఎస్​డీసీ)లతో కలిసి ఏటీడీసీ అపరల్​ మాన్యుఫ్యాక్చరింగ్​, ఫ్యాషన్​ డిజైన్స్​లో డిప్లొమా కోర్సులు అందిస్తోంది.

అపరల్​ మాన్యుఫ్యాక్చరింగ్​ టెక్నాలజీ: ఇది ఏడాది డ్యురేషన్​ గల డిప్లొమా కోర్సు. ఇందులో ప్యాటర్న్​ మేకింగ్​, గార్మెంట్​ కన్​స్ట్రక్షన్​, క్వాలిటీ కంట్రోల్​, ఇండస్ట్రియల్​ ఇంజినీరింగ్​ తదితర గార్మెంట్స్​ ప్రొడక్షన్​/మాన్యుఫ్యాక్చరింగ్​ బేసిక్​ కాన్సెప్ట్​లు నేర్పుతారు.  కోర్సు పూర్తి చేసిన వారికి టాప్​ కంపెనీల్లో అసిస్టెంట్​ మర్చండైజర్​, ఎంటర్​ప్రెన్యూర్​, ప్రొడక్షన్​ సూపర్​వైజర్​, కటింగ్​ రూమ్​ అసిస్టెంట్​, క్వాలిటీ కంట్రోలర్స్​గా జాబ్​ ఆపర్చునిటీస్​ ఉంటాయి.

ఫ్యాషన్​ డిజైన్​ టెక్నాలజీ: ఇది ఏడాది డ్యురేషన్​ గల డిప్లొమా కోర్సు. ఇందులో డిజైన్​ బేసిక్స్​, ఇల్​స్ట్రేషన్, ఎంబ్రాయిడరీస్​, ప్యాటర్న్​ మేకింగ్​, గార్మెంట్​ కన్​స్ట్రక్షన్​, మర్చండైజర్​ తదితర కాన్సెప్ట్​లు నేర్పుతారు. కోర్సు పూర్తి చేసిన వారికి టాప్​ కంపెనీల్లో అసిస్టెంట్​ ఫ్యాషన్​ డిజైనర్​, శాంప్లింగ్​ కోఆర్డినేటర్​, స్టోర్​ మేనేజర్​,  స్టైలిస్ట్​, అసిస్టెంట్​ మర్చండైజర్​ హోదాల్లో జాబ్​ ఆపర్చునిటీస్​ ఉంటాయి.

సీట్లు: ఒక్కో కోర్సులో 40 చొప్పున అడ్మిషన్లు తీసుకుంటారు.

అర్హతలు: 10+2 విధానంలో గుర్తింపు పొందిన బోర్డ్​ నుంచి ఇంటర్​ పాసై ఉండాలి.

వయసు: 18  నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: స్క్రీనింగ్​ టెస్ట్​/ఇంటర్వ్యూ

కోర్సు ఫీజు: ఒక్కో కోర్సుకు ఏడాదికి  రూ.45,000

దరఖాస్తులకు చివరి తేది: 28  ఫిబ్రవరి 2021

సర్టిఫికెట్​ కోర్సులు

ఏటీడీసీ వొకేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ప్యాటర్న్​ మాస్టర్​, అడ్వాన్స్​ ప్యాటర్న్​ మేకర్​  ​ తదితర ఎనిమిది/ఆరు/నాలుగు నెలల సర్టిఫికెట్​ కోర్సులు అందిస్తోంది. వీటికి టెన్త్​/ ఇంటర్మీడియట్​ కంప్లీట్​ చేసిన స్టూడెంట్స్​ అర్హులు.

ఇండస్ట్రియల్​ ఇంజినీరింగ్​ ఎగ్జిక్యూటివ్​

ఇది ఆరు నెలల సర్టిఫికెట్​ కోర్సు. దీన్​ దయాల్​ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(డీడీయూ జీకేవై), తెలంగాణ గవర్నమెంట్​ కొలాబరేషన్​తో ఏటీడీసీ హైదరాబాద్​ వొకేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఈ కోర్సు అందిస్తోంది. కోర్సుకు ఎలాంటి ఫీజు లేదు. హాస్టల్​, బోర్డింగ్​ ఉచితం. ఇంటర్​ పూర్తి చేసిన గ్రామీణ ప్రాంతాల స్టూడెంట్స్​ ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఇండస్ట్రీ, గార్మెంట్స్​, మాన్యుఫాక్చరింగ్​ తదితర బేసిక్​ కాన్సెప్ట్​లతోపాటు సాఫ్ట్​ స్కిల్స్​ నేర్పుతారు. ఆరు నెలల కోర్సు డ్యురేషన్​లో అయిదు నెలలు థియరీ క్లాసెస్​ ఒక నెల ఇండస్ట్రీలో ప్రాక్టికల్​ క్లాసెస్​ ఉంటాయి. నాచారంలోని షాహి ఎక్స్​పోర్ట్​ ఇండస్ట్రీలో ప్రాక్టికల్​ క్లాసెస్​ ఉంటాయి. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు టాప్​ బ్రాండెడ్​ కంపెనీల్లో ఇండస్ట్రియల్​ ఇంజినీర్​గా, ఎగ్జిక్యూటివ్​ శాంప్లింగ్​ మార్కడైజర్​ తదితర హోదాల్లో జాబ్​ ఆపర్చునిటీస్​ ఉంటాయి.

స్కాలర్​షిప్​ సౌకర్యం

ఏటీడీసీ కోర్సుల్లో చేరిన స్టూడెంట్స్​కు కొన్ని స్కాలర్​షిప్​ సౌకర్యాలు కూడా ఉన్నాయి. గర్ల్స్​ కోసం గ్యాప్​ ఇండియా ‘మెరిట్​ కమ్​ మీన్స్​’ స్కాలర్​షిప్​ సౌకర్యం ఉంది.  అపరల్​ మాన్యుఫ్యాక్చరింగ్​ & ఫ్యాషన్​ డిజైన్​ టెక్నాలజీలో ఏడాది డిప్లొమా, ప్రొడక్షన్​ సూపర్​విజన్​& క్వాలిటీ ఎగ్జిక్యూటివ్​ ఆరు నెలల సర్టిఫికెట్​ కోర్సులు చేసే గర్ల్స్​కు ఈ స్కాలర్​షిప్​ వస్తుంది. ఇంటర్​లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఎకనామికల్లీ బ్యాక్​వర్డ్​ గర్ల్స్​కు కూడా స్కాలర్​షిప్​ ఫెసిలిటీ ఉంది.

అడ్మిషన్స్​,​ ఇతర వివరాలకు: ఏటీడీసీ, సర్వే నెం. 64, సైబర్​ టవర్స్​కు సమీపంలో, హైటెక్​సిటీ, మాదాపూర్​, హైదరాబాద్​–500081, ఫోన్​ నెంబర్స్​: 98850 89801, 99121 08844.

నా డ్రీమ్​ ఫ్యాషన్​ డిజైనర్​

ఫ్యాషన్​ డిజైనర్​ అవ్వాలనేది నా డ్రీమ్​. ఫ్రెండ్స్​ ద్వారా ఏటీడీసీ హైదరాబాద్ గురించి తెలిసింది. వెంటనే ఫ్యాషన్​ డిజైన్​ టెక్నాలజీ కోర్సులో జాయిన్​ అయ్యా. ప్లేస్​మెంట్స్​లో మా సీనియర్స్​కు టాప్​ కంపెనీల్లో జాబ్స్​ వచ్చాయి. నాకు కూడా ఫ్యాషన్​ డిజైనర్​గా అవకాశం వస్తుందన్న కాన్ఫిడెన్స్​ ఉంది.

–నిఖిత, హైదరాబాద్​, స్టూడెంట్​​

బెస్ట్​ కెరీర్

టెన్త్​, ఇంటర్​ పూర్తి చేసిన స్టూడెంట్స్​ కోసం ఏటీడీసీ షార్ట్​టర్మ్​, లాంగ్​టర్మ్​ కోర్సులు అందిస్తోంది. కోర్సులు పూర్తి చేసిన వారికి ​అపరల్​, టెక్స్​టైల్​, ఫ్యాషన్​, లైఫ్​స్టైల్​, రిటైల్​ రంగాల్లో100 శాతం ప్లేస్​మెంట్స్​ ఉంటాయి. ఆసక్తి గల స్టూడెంట్స్​ ఏటీడీసీలో సంప్రదించాలి.

–రవి కిశోర్​, రీజినల్​ మేనేజర్ ఏటీడీసీ హైదరాబాద్​

For More News..

ఎకానమీలో ఈ ఏడాది గ్రోత్​ గ్యారెంటీ

స్కూల్స్ రీ ఓపెన్.. శానిటైజేషన్‌కు ఫుల్ డిమాండ్

దేశంలోనే మన పోలీసులు బెస్ట్

Latest Updates